Petrol and diesel prices :పెట్రోలుపై లీటరుకు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంపు.. రేట్లు ఇవే..!

Petrol and diesel prices : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు ఇంధన ధరల్ని పెంచాయి.

Update: 2021-10-03 14:57 GMT

Petrol and diesel prices : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు ఇంధన ధరల్ని పెంచాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసల ధర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర 102 రూపాయల 39 పైసలు... డీజిల్‌ ధర 90 రూపాయల 77 పైసలకు చేరింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర 106 రూపాయలకు పైగానే ఉంది. గత పది రోజుల్లో ఎనిమిది సార్లు చమురు సంస్థలు ధరల్ని సవరించాయి.

సెప్టెంబర్‌ 24 నుంచి ధరల పెరుగుదల ప్రారంభం కాగా... ఇప్పటివరకు పెట్రోల్ పై రూపాయి 25 పైసలు.. డీజిల్‌పై 2 రూపాయల 15 పైసలు ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే... పెట్రో ధరల పెంపునకు కారణమని చమురు విక్రయ సంస్థలు చెబుతున్నాయి. అయితే వినియోగదారులు మాత్రం ఈ పెరుగుదలపై తీవ్రంగా మండిపడుతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రేట్లు పెంచుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో పెట్రో ధరల పెరుగుదలపై జనం మండిపడుతున్నారు. తాజా పెంపుతో నగరంలో పెట్రోల్‌ ధర 106 రూపాయల 51 పైసలు.. డీజిల్‌ ధర 99 రూపాయల 04 పైసలకు చేరింది. ప్రభుత్వాలు ఇలా ధరలు పెంచుతూ పోతే వాహనాలను ఇంట్లో పడేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు వినియోగదారులు.ఇక అటు విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 107రూపాయల 40 పైసలు, డీజిల్‌ ధర 99 రూపాయల 42 పైసలకు చేరింది. ప్రజల సంక్షేమమే ధ్యేయమని చెప్పే వైసీపీ సర్కారు... పక్క రాష్ట్రాలను చూసైనా టాక్స్‌ తగ్గించాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు. 

Tags:    

Similar News