Petrol and diesel prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్..!
Petrol and diesel prices : పెట్రోల్, డీజిల్‌ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్పెట్రోల్ధర 110 రూపాయలకు చేరువవుతోంది.;
Petrol and diesel prices : పెట్రోల్, డీజిల్‌ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్పెట్రోల్ధర 110 రూపాయలకు చేరువవుతోంది. అటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. విజయవాడలో అయితే పెట్రోల్ ధర ఏకంగా 111 రూపాయలు దాటేసింది. డీజిల్ ధర 103 రూపాయలపైనే ఉంది. విశాఖ, తిరుపతిలో సైతం పెట్రోల్ 111 రూపాయలు దాటింది.
దాదాపు ఏడాదికాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల నుంచి పెట్రో వాతలు ఆగినప్పటికీ.. మళ్లీ మొదలయ్యాయి. రోజుకు 30 పైసలు, 40 పైసల చొప్పున పెంచుకుంటూ పోతోంది. రోజువారీ వడ్డన కింద పెంచేది తక్కువే అయినప్పటికీ... ఓ నెల తరువాత చూస్తే పెట్రో వడ్డన మామూలుగా ఉండడం లేదు. గతేడాది 80 రూపాయల దగ్గర ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాయలకు చేరువైంది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయి ధరలు పెరుగుతున్నాయనే కారణంతో దేశీయంగా రేట్లు పెంచుతున్నాయి చమురు సంస్థలు. నిజానికి గతేడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా ముడి చమురు ధరలు లైఫ్‌టైం కనిష్ట స్థాయికి చేరాయి. అయినప్పటికీ.. మన దగ్గర రేట్లు మాత్రం తగ్గలేదు. పైగా కరోనాతో కుదేలయ్యారన్న కనికరం లేకుండా ధరలు పెంచారు. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్థానిక పన్నులను పెంచి సామాన్యులపై మరింత భారం మోపారు.