సామాన్యుడిని భయపెడుతున్న పెట్రోల్ ధరలు..!
పెట్రోల్ ధరలు సామాన్యుడిని భయపెడుతూనే ఉన్నాయి. వరుసగా ఏడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెంపుతో రాజస్థాన్ లో పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ కొట్టింది.;
పెట్రోల్ ధరలు సామాన్యుడిని భయపెడుతూనే ఉన్నాయి. వరుసగా ఏడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెంపుతో రాజస్థాన్ లో పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ కొట్టింది. శ్రీగంగానగర్ లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరింది. ఇక ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.88.99కి చేరింది. ముంబైలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పెట్రోల్ ధర రూ.95.46కి చేరుకుంది. చేరుకుంది.
లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.79.35కు చేరగా.. ముంబైలో రూ.86.34కు చేరింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని చాలా నగరాల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరువలో ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.92.53, డీజిల్ ధర రూ.86.55గా ఉండగా.. విజయవాడలో పెట్రోల్ ధర రూ.95.55 డీజిల్ ధర రూ.89.02గా ఉంది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్ పెట్రోల్ ధర ఆదివారమే రూ.100 దాటేసింది. శ్రీగంగానగర్‌లో బ్రాండెడ్ పెట్రోల్ ధర లీటరుకు రూ.102.34, డీజిల్ ధర రూ.95.15గా ఉంది. ఇదిలా ఉంటే.. ఏడు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.04, డీజిల్ ధర రూ.2.22 పెరిగింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడిచమురు ధర 63.20 డాలర్ల ఎగువనే కదలాడుతోంది. ధర ఇంకా పెరిగితే దేశీయ మార్కెట్లో పెట్రో ధరలు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ధరల పెరుగుదలతో వాహనాదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.