హద్దుల్లేకుండా పెరిగిపోతున్నాయి ఆయిల్ ధరలు
త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ ఖాయమంటున్నాయి.;
ముడిచమురు ధరలు ఏమోగానీ వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. శుక్రవారం పెట్రో ధరలు సరికొత్త రీతిలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలను 25 పైసలు పెంచాయి కంపెనీలు.
ముంబైలో పెట్రోలు ధర రూ. 92 ను తాకడంతో... రికార్డు హైకి చేరినట్లైంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ ఖాయమంటున్నాయి.
ధరలు చూస్తే...
ముంబై పెట్రోలు ధర రూ. 92.04, డీజిల్ ధర రూ. 82.40,
చెన్నై పెట్రోలు ధర రూ. 88.07, డీజిల్ ధర రూ. 80.90,
కోల్‌కతా పెట్రోలు ధర రూ. 86.87, డీజిల్ ధర రూ. 79.23,
విజయవాడ పెట్రోలు ధర రూ. 91.68, డీజిల్ ధర రూ.84.84,
హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 88.89, డీజిల్ ధర రూ.82.53.