Petrol and Diesel Prices: పండగరోజు సామాన్యుడిపై పెట్రోల్‌ ధరల బాదుడు

Petrol and Diesel Prices: పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు.

Update: 2021-10-16 04:45 GMT

Petrol and Diesel Prices: పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్‌ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది.

మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 17 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 14 సార్లు ఎగబాకాయి. తాజాగా శుక్రవారం లీటర్‌ పెట్రోల్ 35 పైసలు‌, డీజిల్‌పై 36 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.14కు, ముంబయిలో రూ.111.09కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.101.78ను, ఢిల్లీలో రూ.93.87ను తాకింది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.04, డీజిల్‌ రూ.104.44కి చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 84.64 డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయికి చేరడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు రూ.110 దిశగా వెళుతుంటే.. డీజిల్‌ ధరలు ఇప్పటికే రూ.100 మార్క్‌ను దాటేశాయి.

Tags:    

Similar News