రిలయన్స్ డిజిటల్ రిపబ్లిక్ డే సేల్.. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు
ఈ సేల్‌లో అదనంగా బెనిఫిట్స్ పొందాలనుకునేవారు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో పొందవచ్చు.;
మరో వారం రోజుల్లో రానున్న రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజాలు సేల్స్ పెంచుకునే నిమిత్తం వినియోగ దారులను ఆకర్షించేందుకు సమాయత్తమవుతున్నాయి. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ డిజిటల్ కూడా ఆఫర్లను ప్రకటిస్తోంది. డిజిటల్ ఇండియా పేరుతో రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రీ బుకింగ్ ఆఫర్‌లను ప్రకటించిన సంస్ధ ఈ నెల 22 నుంచి 26 తేదీల్లో డిజిటల్ ఇండియా సేల్ నడుస్తోంది.
ఈ సేల్‌లో అదనంగా బెనిఫిట్స్ పొందాలనుకునేవారు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో పొందవచ్చు. మొత్తానికి అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ఈ షాపింగ్ దిగ్గజాలు మాత్రమే కాకుండా, రిలయన్స్ కూడా ముందు వరుసలో నిలవనుంది. అందులో భాగంగానే రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు డబుల్ బెనిఫిట్ అందిస్తూ, అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ డిజిటల్ ఇండియా సేల్ పేరుతో దూసుకుపోవడానికి ముందు వరుసలో నిలిచింది.