Renault Kiger: కొత్తగా మార్కెట్లోకి MY22 రెనాల్ట్ కిగర్.. ధర, ఫీచర్లు చూస్తే..

Renault Kiger: కొత్త MY22 సబ్‌కాంపాక్ట్ SUV మైనర్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, కొత్త కలర్ ఆప్షన్స్. మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది.

Update: 2022-04-01 11:00 GMT

Renault Kiger:రెనాల్ట్ ఇండియా ఇప్పుడు 2022 మోడల్ ఇయర్ కిగర్‌ను రూ. 5.84 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) విడుదల చేసింది. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌లలో కిగర్ ఒకటి. కిగర్ లాంచ్‌తో కంపెనీ భారతదేశంలో కూడా కస్టమర్‌లను పెంచుకుంది.

కొత్త MY22 సబ్‌కాంపాక్ట్ SUV మైనర్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, కొత్త కలర్ ఆప్షన్స్. మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది.

2022 రెనాల్ట్ కిగర్ స్పెక్స్ ఫీచర్లు

MY22 రెనాల్ట్ కిగర్ టెయిల్‌గేట్ క్రోమ్ ఇన్సర్ట్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, టర్బో డోర్ డీకాల్స్, రెడ్ వీల్ క్యాప్స్‌తో కూడిన 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రెనాల్ట్ యొక్క 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 2021లో ప్రారంభించబడిన Kiger RXT(O) వేరియంట్ ఇప్పుడు MT & X-TRONIC CVT ట్రాన్స్‌మిషన్‌లో మాన్యువల్ మరియు CVT – 1.0L టర్బో రెండింటిలోనూ అందించబడుతోంది.

MY22 రెనాల్ట్ కిగర్ డ్యూయల్ టోన్ కలర్ షేడ్‌లో మిస్టరీ బ్లాక్ రూఫ్‌తో కొత్త మెటల్ మస్టర్డ్‌ కలర్ లో అందుబాటులోకి వచ్చింది. డ్యాష్‌బోర్డ్ కొత్త రెడ్ ఫేడ్ తో అప్‌డేట్ చేయబడింది. 2022 రెనాల్ట్ కిగర్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

LED హెడ్‌లైట్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

కిగర్ రెండు పవర్ ఇంజన్స్ తో అందుబాటులో ఉంది - MT , EASY-R AMT ట్రాన్స్‌మిషన్‌లలో ఒక 1.0L ఎనర్జీ ఇంజిన్ మరియు MT & X-TRONIC CVT ట్రాన్స్‌మిషన్‌లలో 1.0L టర్బో. టర్బోచార్జ్డ్ 1.0L పెట్రోల్ ఇంజన్ (5-స్పీడ్ మాన్యువల్) 20.5 KM/L ARAI సర్టిఫైడ్ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

రెనాల్ట్ ఇండియా నేపాల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాకు కిగర్‌ను ఎగుమతి చేస్తుంది. కొత్త MY22 Renault Kiger కోసం బుకింగ్‌లు మార్చి 31, 2022 నుండి ప్రారంభమయ్యాయి. 

Tags:    

Similar News