మా డబ్బు లెక్క ఇదేనంటున్న రిలయన్స్

Update: 2020-11-21 12:11 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెండ్ మొత్తానికి ఫండ్ రైజింగ్ ప్రక్రియ పూర్తి చేసింది. ఇంతకాలం మాటలతో నడిచిన లావాదేవీలు ఎట్టికేలకు కంపెనీ అకౌంట్స్ బుక్స్ లోకి చేరాయి. ఇందులో భాగంగా మొత్తం రూ.47,265 కోట్లు ఫండ్ రైజ్ చేసినట్టు ప్రకటించింది కంపెనీ. మొత్తం 10.9శాతం స్టేక్ తో సమానమైన 69 కోట్ల 27లక్షల 81వేల 234 షేర్లు ఇన్వెస్టర్లకు కేటాయించింది కంపెనీ. ఇక కంపెనీ ఇప్పటికే నెట్ మెడ్స్ కంపెనీని సొంతంచేసుకుంది. ఇటీవల హోమ్ డెకార్ కంపెనీ అర్బన్ లాడర్ లో కూడా 96శాతం వాటాను రూ.182.12కోట్లకు తీసుకుంది. అంతేకాదు.. మిగిలిన 4శాతం కూడా త్వరలో కంపెనీ సొంతమవుతుంది. ఫ్యూచర్ గ్రూపు డీల్ కూడా ప్రస్తుతం వివాదంలోఉంది. అయినా కంపెనీ చేతికి చిక్కనుంది. కంపెనీ అధికారిక లెక్కల మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి టర్నొవర్ రూ.162936 కోట్లు కాగా.. నెట్ ప్రాఫిట్ రూ.5448 కోట్లుగా చూపించింది.

Also Read:profit your trade


Tags:    

Similar News