Royal Enfield : కేటీఎంకు సవాల్ విసరనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. టీజర్ విడుదల.. ఫీచర్లు అదుర్స్.
Royal Enfield : అడ్వెంచర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కంపెనీ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ బైక్ హిమాలయన్ 750 టీజర్‌ను విడుదల చేసి మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచింది. "Born at 5,632 meters" అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ టీజర్ EICMA 2025 ఈవెంట్‌కు ముందు బైక్ లవర్స్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న హిమాలయన్ 450 కంటే ఉన్నత స్థానంలో ఈ 750సీసీ బైక్ లైనప్‌లో చేరనుంది. ఇది ఎప్పుడైనా వచ్చే ఏడాది మార్కెట్‌లోకి లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తమ అత్యంత పవర్ఫుల్ అడ్వెంచర్ టూరింగ్ బైక్ హిమాలయన్ 750 టీజర్‌ను విడుదల చేసి, అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో కొత్త చర్చకు తెరలేపింది. హిమాలయన్ 750 మోడల్ ప్రస్తుత హిమాలయన్ 450 కంటే ఉన్నత స్థానంలో లైనప్‌లో చేరనుంది. ఈ బైక్ వచ్చే సంవత్సరంలో (2026) ఎప్పుడైనా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. "Born at 5,632 meters" అనే ట్యాగ్‌లైన్ ఈ బైక్ అత్యంత కఠినమైన పర్వత ప్రాంతాల్లో ప్రయాణించగలిగే కెపాసిటీని సూచిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే పేరుతో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా డెవలప్ చేస్తోంది. అయితే ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్ కలిగిన వెర్షన్ ముందుగా మార్కెట్లోకి వస్తుంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బైక్ మోడల్స్‌లో అనేక ముఖ్యమైన డిజైన్, హార్డ్‌వేర్ అప్‌డేట్‌లు కనిపించాయి. డిజైన్ పరంగా ఇది 450 సీసీ మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, మరింత ఆకర్షణీయమైన ఫ్రంట్ కౌల్, పొడవైన విండ్‌స్క్రీన్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, లింకేజ్‌తో కూడిన సరికొత్త మోనోషాక్ ఛాసిస్ వంటి మార్పులతో పటిష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫ్లాగ్‌షిప్ బైక్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన 750సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ అమర్చబడింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ ప్లాట్‌ఫామ్‌కు మరింత పెద్ద, పవర్ఫుల్ వెర్షన్. ఈ మోటార్ 50 hp కంటే ఎక్కువ పవర్, 55 Nm కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనికి స్లిప్పర్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది. కాక్‌పిట్‌లో TFT స్క్రీన్ ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సదుపాయాన్ని అందిస్తుంది. రైడర్‌కు ఉపయోగపడేలా రైడ్ మోడ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 మోడల్ హోండా CB500X, రాబోయే BMW F 450 GS, కవాసకీ KLE 500, కేటీఎం (KTM) అడ్వెంచర్ సిరీస్ వంటి మోటార్‌సైకిళ్లకు తీవ్ర పోటీ ఇవ్వనుంది.