Airtel Offer : 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్... !
Airtel Offer : కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది మొబైల్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారు.;
Airtel Offer : కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది మొబైల్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తను నెట్వర్క్ లోని తక్కువ ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ. 49 ప్యాక్ ని ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్యాక్ కింద 100 ఎంబీ డేటా, 38 రూపాయల విలువైన టాక్ టైమ్, 28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడుతున్నట్లు పేర్కొంది. అలాగే రూ.79 రీచార్జ్ కూపన్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రెండు బెనిఫిట్స్ కూడా రాబోయే వారంలో ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.