SBI : మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా.. బీ అలర్ట్ నేడు సర్వీసులు బంద్.

Update: 2025-10-25 06:15 GMT

SBI : భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. సిస్టమ్ మెయింటెనెన్స్ పనుల కారణంగా, అక్టోబర్ 25, 2025 (శనివారం) తెల్లవారుజామున కొన్ని గంటల పాటు తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఈ నిర్వహణ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ వంటి కీలక సర్వీసులు సుమారు 60 నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. కాబట్టి, అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే, ఏటీఎం, యూపీఐ లైట్ సర్వీసులను ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ వినియోగదారులకు సూచించింది.

సిస్టమ్ మెయింటెనెన్స్ కార్యకలాపాల కారణంగా ఎస్‌బీఐ తమ డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అక్టోబర్ 25, 2025 (శనివారం) రాత్రి 01:10 గంటల నుంచి తెల్లవారుజామున 02:10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) మొత్తం 60 నిమిషాల పాటు సేవలు నిలిచిపోతాయి.

ఈ సమయంలో యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ వంటి కీలక సర్వీసులు అందుబాటులో ఉండవు. మెయింటెనెన్స్ పూర్తయిన వెంటనే, ఉదయం 02:10 గంటల నుంచి అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.

మెయింటెనెన్స్ సమయంలో అత్యవసర లావాదేవీలు చేయాల్సి వస్తే, ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ లైట్ సర్వీసులను ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. యూపీఐ లైట్ అనేది ఒక డిజిటల్ వాలెట్ సర్వీసు. ఇది రూ.1,000 వరకు చిన్న లావాదేవీలను పిన్ అవసరం లేకుండానే తక్షణమే పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.

Tags:    

Similar News