వినియోగదారులకు SBI హెచ్చరిక!

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. వినియోగదారులకు వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేసింది.

Update: 2021-01-17 14:15 GMT

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. వినియోగదారులకు వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేసింది. కొందరు మోసగాళ్లు బ్యాంకు ప్రతినిధుల పేరిట కాల్, మెసేజ్ చేసి కేవైసీ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారని హెచ్చరించింది. వారికి బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ లాంటి వివరాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. అలాంటి అంశాలు దృష్టికి వస్తే https://cybercrime.gov.in/కు తెలియజేయాలని సూచించింది. ఈ రోజుల్లో కేవైసీ పేరిట మరిన్ని మోసం కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతేకాకుండా OTP ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిచింది.


Tags:    

Similar News