Hyunai Venue : ఫస్ట్ టైమ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్విన్ డిస్‌ప్లేలు.. మార్కెట్లో సంచలనం క్రియేట్ చేయనున్న హ్యుందాయ్ వెన్యూ.

Update: 2025-10-25 12:15 GMT

Hyunai Venue : భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ వెన్యూ సరికొత్తగా, మరింత బోల్డ్‌గా రాబోతోంది. హ్యుందాయ్ ఇండియా తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన సెకండ్ జనరేషన్ వెన్యూను అధికారిక ధరల ప్రకటనకు (నవంబర్ 4న) ముందే తాజాగా పరిచయం చేసింది. కొత్త వెన్యూ మునుపటి మోడల్‌తో పోలిస్తే డిజైన్, ఇంటీరియర్‌, ఫీచర్లలో చాలా మార్పులు చేసుకుంది. గ్లోబల్ ఎస్‌యూవీల నుంచి ప్రేరణ పొందిన మరింత స్ట్రాంగ్ లుక్, లగ్జరీ కార్ల తరహా క్యాబిన్ ఫీచర్లు ఇందులో హైలైట్‌గా నిలిచాయి. పాత వెన్యూతో పోలిస్తే కొత్త వెన్యూ ఎంత భిన్నంగా ఉందో, ఏ కొత్త ఫీచర్లు వచ్చాయో వివరంగా తెలుసుకుందాం.

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ పాత మోడల్‌లోని గుండ్రని అంచులకు బదులుగా, మరింత స్కైర్ షేపులో, స్ట్రాంగ్గా ఉండే డిజైన్‌‎తో వస్తుంది. ఇది హ్యుందాయ్ కొత్త గ్లోబల్ ఎస్‌యూవీల డిజైన్ నుంచి ప్రేరణ పొందింది. బోనెట్ లైన్‌పై ఇప్పుడు ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉంటుంది. ఇది రెండు వైపులా ఉన్న కొత్త క్వాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలుపుతుంది. ముందు గ్రిల్ మరింత వెడల్పుగా, కొత్త ప్యాటర్న్‌తో, సిల్వర్ ఫినిష్ బంపర్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

వెనుకవైపు బ్లాక్-ప్యాటర్న్ టైల్‌ల్యాంప్‌లను కలుపుతూ హ్యుందాయ్ లోగో పైన కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్ ఉంది. కొత్త స్పోర్టీ బంపర్ డిజైన్ వెనుక లుక్ స్టైలిష్‌గా మార్చింది. స్క్వేర్ వీల్ ఆర్చెస్, కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు మందపాటి బాడీ క్లాడింగ్ కారణంగా సైడ్ నుంచి చూసినప్పుడు వెన్యూ మరింత పటిష్టంగా కనిపిస్తుంది.

కొత్త వెన్యూ క్యాబిన్‌లో జరిగిన మార్పులు మరింత అద్భుతంగా ఉన్నాయి. ఇంటీరియర్ ఫ్లాట్‌గా, మరింత టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మార్పు, పెద్ద కర్వ్డ్ గ్లాస్ యూనిట్‌లో రెండు 12.3-అంగుళాల డిస్‌ప్లేలు అమర్చడం. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. డాష్‌బోర్డ్, ఏసీ వెంట్స్‌ను కొత్తగా డిజైన్ చేశారు. పాత గుండ్రని వెంట్లకు బదులు, స్లిమ్ హారిజాంటల్ వెంట్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్ల నుంచి ప్రేరణ పొందిన బ్యాక్‌లిట్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను ఇందులో ఇచ్చారు. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇప్పుడు టచ్-బేస్డ్ ఇంటర్‌ఫేస్‌తో మరింత లేటెస్టుగా కనిపిస్తుంది.

కొత్త జనరేషన్ వెన్యూలో ఫ్యామిలీ కంఫర్ట్, టెక్నాలజీకి సంబంధించిన అనేక అప్‌డేట్‌లు యాడ్ చేశారు. వెన్యూలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు జత చేశారు. వెనుక సీట్లలో ఇప్పుడు టు స్టెప్ రెక్లైన్ ఫంక్షన్, విండో సన్‌షేడ్స్ ఉన్నాయి. పెద్దదైన వీల్‌బేస్ కారణంగా లెగ్‌రూమ్ పెరిగింది. వెడల్పాటి వెనుక డోర్లు లోపలికి/బయటికి రావడాన్ని సులభతరం చేస్తాయి. సెంటర్ కన్సోల్‌లో వెంటిలేటెడ్ సీట్ల కంట్రోల్స్, డ్రైవ్, ట్రాక్షన్ మోడ్ స్విచ్‌లు ఉన్నాయి.

కొత్త వెన్యూ ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు లేవు. పాత మోడల్‌లోని ఇంజిన్లనే కొనసాగిస్తున్నారు. 1.2-లీటర్ పెట్రోల్ (మాన్యువల్), 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ లో వస్తుంది. పెట్రోల్ మోడల్ 7 ట్రిమ్స్‌లో, డీజిల్ మోడల్ 4 ట్రిమ్స్‌లో లభించనుంది.

Tags:    

Similar News