Stock Market : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market : ప్రపంచ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతోన్నాయి. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు.;
ప్రపంచ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతోన్నాయి. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి తీరుతుందన్న ఆందోళనలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధంతో వాటిల్లే ఇతరత్రా పరిణామాలతో ఆర్థిక స్థిరత్వం కోల్పోతామమన్న భయాలు మార్కెట్ సెంటింమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. దీనికితోడు రష్యాపై యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో మార్కెట్లు బేర్‌గుప్పిట్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ టెన్షన్‌తో ఇవాళ చిన్న షేర్లు చితికిపోతున్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండుశాతం పైగా నష్టపోగా... మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం నష్టంతో ఉంది. మెటల్స్, టెక్నాలజీ కౌంటర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండగా... బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లోని అన్ని రంగాల కౌంటర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో 1736 స్టాక్స్ నష్టాల్లో ఉండగా... కేవలం 150 స్టాక్స్ మాత్రమే లాభాల్లో కొనసాగుతోన్నాయి. టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను లీడ్ చేస్తున్నాయి.
రష్యాపై నాటో కూటమి దేశీలు పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్‌తో సహా అమెరికాలు ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ నుంచి వేర్పడిన డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ప్రాంతాల్లో అమెరికన్లు ఎలాంటి పెట్టుబడులు పెట్టరు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన వస్తువులు, సేవలు, టెక్నాలజీలను ఏ రూపంలోనూ ఇకపై అమెరికా అనుమతించబోదని జో బైడెన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించారని ఆరోపిస్తూ రష్యాపై పలు ఆంక్షలు విధుస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.