Electric Scooters : హాలీవుడ్ లెవల్ ఫీచర్లు.. ఈ టచ్‌స్క్రీన్ బండ్లు చూస్తే కళ్ళు చెదరాల్సిందే.

Update: 2026-04-09 09:30 GMT

Electric Scooters : భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడమే కాకుండా, స్టైలిష్‌గా కనిపించాలని యూత్ ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే కంపెనీలు కూడా స్కూటర్లను కేవలం వాహనాల్లా కాకుండా, చక్రాలున్న స్మార్ట్‌ఫోన్లలా తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలతో ఈ స్కూటర్లు హైటెక్ లుక్‌ను సంతరించుకుంటున్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వెర్షన్ లో 7-అంగుళాల భారీ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్స్ తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ ఏకంగా 212 కిమీల దూరం వెళ్తుంది. దీని ధర రూ. 1.71 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఓలా S1 ప్రో జెన్ 3

ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో అధునాతన మూవ్ ఓఎస్ (MoveOS) పై పనిచేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ అందించింది. ఎస్‌ఓఎస్ అలర్ట్స్, క్రూజ్ కంట్రోల్, డిజిటల్ కీ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 1.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఏథర్ రిజ్తా, 450X

ఏథర్ రిజ్వా, 450X మోడళ్లలో గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ చేసే 7-అంగుళాల డ్యాష్‌బోర్డ్ ఉంది. ఇది జూమ్, స్లైడ్ వంటి జెశ్చర్లను సపోర్ట్ చేస్తుంది. లైవ్ లొకేషన్ షేరింగ్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లతో ఇవి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల నుండి మొదలవుతాయి.

సింపల్ వన్

ఫీచర్ల విషయంలో సింపుల్ వన్ ఎవరికీ తీసిపోదు. ఇందులో కూడా 7-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది. స్మార్ట్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఒక్క ఛార్జ్‌పై 265 కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ. 1.69 లక్షలుగా ఉంది.

Tags:    

Similar News