Gold ETF : రూ.1000తో గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి.. అక్టోబర్ 24 నుండి అక్టోబర్ 31 వరకే ఛాన్స్.

Update: 2025-10-25 07:45 GMT

Gold ETF : గత సంవత్సర కాలంలో భారతీయ దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వలన, పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ పసిడి వైపు మళ్లింది. మార్కెట్ ఒడిదొడుకులు, ప్రపంచ సంక్షోభాల మధ్య బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. మీరు బంగారు ఆభరణాలు లేదా నాణేలు కొనడానికి బదులుగా డిజిటల్‌గా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఒక అద్భుతమైన అవకాశం. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ చాయిస్ మ్యూచువల్ ఫండ్ కింద ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో మీరు కేవలం రూ.1000 నుంచే మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ మ్యూచువల్ ఫండ్ విభాగం ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌ను అందిస్తోంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి కొత్త ఫండ్ ఆఫర్ అక్టోబర్ 24, 2025 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు కనీసం రూ.1,000 నుంచి తమ గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

ఎన్ఎఫ్‌ఓ ముగిసిన తరువాత ఈ ఫండ్ దేశంలోని రెండు ప్రధాన ఎక్స్ఛేంజీలు అయిన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ అవుతుంది. దీని ద్వారా డిజిటల్‌గా బంగారం కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. ముందుగా సెబీ చేత రిజిస్టర్ అయిన ఒక స్టాక్ బ్రోకర్ నుండి సరైన సలహా తీసుకోవాలి. ఇది సరైన ఫండ్‌ను ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది.

గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి, మీకు తప్పనిసరిగా డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ అవసరం. ఈ ఖాతా ద్వారానే మీరు గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయగలరు. విక్రయించగలరు.

కొనుగోలు ప్రక్రియ:

* అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, మీ ట్రేడింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

* గోల్డ్ ఈటీఎఫ్ ఆప్షన్ ఎంచుకోండి.

* మీకు నచ్చిన ఫండ్, బంగారం యూనిట్లను సెలక్ట్ చేసుకోవాలి.

* పేమెంట్ చేసిన కొద్దిసేపటికే, మీ పెట్టుబడి కన్ఫాం మెసేజ్ వస్తుంది.

ఈ విధంగా మీరు డిజిటల్ పద్ధతిలో చాలా సులభంగా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

Tags:    

Similar News