స్టాక్ మార్కెట్‌లో బుల్స్ హవా
ఇవాళ 260 పాయింట్ల లాభంతో 63,588 పాయింట్లను తాకింది.;
స్టాక్ మార్కెట్‌లో బుల్స్ హవా కొనసాగుతోంది. వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన అమెరికా సెంట్రల్ బ్యాంక్ తాజాగా విరామం ఇచ్చింది. ఆరంభంలో కాస్త నిరాశపర్చినా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి మరింత పెరిగింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయిని దాటింది. ఇవాళ 260 పాయింట్ల లాభంతో 63,588 పాయింట్లను తాకింది. 137 సెషన్స్ తరవాత సెన్సెక్స్ కొత్త ఆల్ టైమ్ హైని తాకడం విశేషం. రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ ఇవాళ మార్కెట్‌కు అండగా నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టి కూడా ఆల్ టైమ్ హై కి చేరువలో ఉంది. ఏక్షణమైనా కొత్త రికార్డును నెలకొల్పే అవకాశముంది.