SWIGGY, ZOMATO: స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాక్

స్విగ్గీ, జొమాటో తమ ప్రీమియం సబ్‌స్క్రైబర్లపై ‘రెయిన్ సర్‌ఛార్జ్’ మినహాయింపును ఎత్తివేత;

Update: 2025-05-17 05:00 GMT

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటో తమ ప్రీమియం సబ్‌స్క్రైబర్లపై ‘రెయిన్ సర్‌ఛార్జ్’ మినహాయింపును ఎత్తివేశాయి. అంటే ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ సభ్యులు కూడా సాధారణ వినియోగదారుల్లా వర్షం వస్తే అదనపు ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రీమియం ప్లాన్‌లతో వినియోగదారులకు డెలివరీ ఫీజులో మినహాయింపులు, ప్రత్యేక ఆఫర్లు, త్వరిత సేవలు లభించేవి. అందులో భాగంగా వర్షం పడే సమయంలో విధించే రెయిన్ సర్‌ఛార్జ్‌ నుంచి (మినహాయింపు) ఉండేది. కానీ తాజా నిర్ణయంతో రూ.15 నుండి రూ.30 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సంస్థలు ఇప్పటికే క్విక్‌ కామర్స్‌ విభాగంలో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాలు తగ్గించేందుకు డెలివరీ ఫీజుతో పాటు ప్లాట్‌ఫామ్ ఫీజులు కూడా వసూలు చేస్తుండగా, ఇప్పుడు రెయిన్‌ సర్‌ఛార్జ్‌ను అన్ని కేటగిరీల యూజర్లకు వర్తింపజేస్తున్నాయి. ఈ నిర్ణయం తర్వాత స్విగ్గీ, జొమాటో కంపెనీల షేర్లు మార్కెట్లో లాభాల బాట పట్టినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News