షాకింగ్ న్యూస్ చెప్పిన TATA
ప్రజంట్ కంపెనీ CEOగా ఉన్న జ్యున్టర్ బషక్ జూన్ 30వరకు మాత్రమే కొనసాగుతారని తెలిపింది.;
టాటా మోటార్స్ ఇటీవల కంపెనీ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మార్క్ ఎల్ లిస్టోసిల్లా చేరతారని గత నెల్లో కంపెనీ ప్రకటించింది. జులై 1 నుంచి ఆయనే కంపెనీ బాధ్యతలు చేపడతారని వెల్లడించింది. ఫిబ్రవరి 12న కంపెనీ సెబీకి సమాచారం కూడా ఇచ్చింది. ఏమైందో ఏమో గానీ అనూహ్యంగా కంపెనీ మార్క్ కంపెనీలో చేరడం లేదని ప్రకటించింది.
ప్రజంట్ కంపెనీ CEOగా ఉన్న జ్యున్టర్ బషక్ జూన్ 30వరకు మాత్రమే కొనసాగుతారని తెలిపింది.
అయితే కొత్తగా ఎవరు వస్తారన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 2016లో కంపెనీలో చేరిన జ్యున్టర్ తాను జర్మనీ వెళుతున్నట్టు.. కంపెనీ వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో మార్క్ ను సంప్రదించారు. బస్ కార్పొరేషన్ , ఫ్యూజో ట్రక్, దైమ్లర్ ట్రక్స్ ఏసియా సంస్థల్లో హెడ్ గా పనిచేసిన అనుభవంతో ఆయన్ను టాటలోకి తీసుకుకొచ్చేందుకు ఒప్పందంచేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన కూడా వెనక్కు తగ్గారు.