TAX: పన్ను భారం తగ్గుతుందా? పెరుగుతుందా?

2026-27 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి ప్ర­వే­శ­పె­ట్టిన బడ్జె­ట్‌­లో అనేక పన్ను మా­ర్పు­లు

Update: 2026-02-09 05:00 GMT

2026-27 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి ప్ర­వే­శ­పె­ట్టిన బడ్జె­ట్‌­లో అనేక పన్ను మా­ర్పు­లు చోటు చే­సు­కు­న్నా­యి. మధ్య తర­గ­తి­కి ఎలాం­టి ఉప­శ­మ­నం లే­క­పో­యి­నా, పన్నుల వి­ధా­నం­లో పలు మా­ర్పు­లు చే­శా­రు. ము­ఖ్యం­గా ఏప్రి­ల్‌ 1 నుం­చి కొ­త్త ఆదాయ పన్ను (ఐటీ) చట్టం, 2025 అమ­ల్లో­కి వస్తు­న్న­ట్టు ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌ ప్ర­క­టిం­చా­రు. దీం­తో ఐటీ రి­ట­ర్న్‌ల ఫై­లిం­గ్‌, వి­వా­దాల పరి­ష్కా­రం మరింత సు­ల­భం అవు­తుం­ద­ని మం­త్రి తె­లి­పా­రు. దీ­ని­కి తోడు ఈ బడ్జె­ట్‌­లో పే­ర్కొ­న్న పది ప్ర­ధాన అం­శా­లు వ్య­క్తి­గత, పన్ను చె­ల్లిం­పు­దా­రు­ల­ను ప్ర­భా­వి­తం­చే­య­ను­న్నా­యి. 

విదేశాల్లో విద్య, వైద్యం

ఏటా లక్ష­లా­ది మంది భా­ర­తీ­యు­లు వి­ద్య, వై­ద్యం కోసం వి­దే­శా­ల­కు వె­ళు­తు­న్నా­రు. ఇం­దు­కో­సం పె­ద్ద మొ­త్తం­లో­నే ఖర్చ­వు­తోం­ది. ఈ మొ­త్తా­ల­పై ప్ర­భు­త్వం 5 శాతం టీ­సీ­ఎ­స్‌ వసూ­లు చే­స్తోం­ది. ఏప్రి­ల్‌ 1 నుం­చి పన్ను­ను 2 శా­తా­ని­కి కు­ది­స్తు­న్న­ట్టు ఆర్థిక మం­త్రి సీ­తా­రా­మ­న్‌ తె­లి­పా­రు. డా­ల­ర్‌­తో రూ­పా­యి మా­ర­కం రేటు రో­జు­రో­జు­కు పత­న­మ­వు­తు­న్న ప్ర­స్తుత తరు­ణం­లో వి­దే­శా­ల్లో­ని తమ పి­ల్లల చదు­వు­లు, వై­ద్య ఖర్చుల కోసం డబ్బు­లు పంపే వా­రి­కి ఇది పె­ద్ద ఊర­ట­నే చె­ప్పా­లి.

ఎఫ్‌ అండ్‌ ఓపై బాదుడు

స్టా­క్‌ మా­ర్కె­ట్లో స్పె­క్యు­లే­ష­న్‌ ట్రే­డిం­గ్‌ వి­ప­రీ­తం­గా పె­రి­గి­పో­యిం­ది. దీం­తో చి­న్న, రి­టై­ల్‌ మదు­ప­రు­లు సైతం ఎఫ్‌ అం­డ్‌ ఓ ట్రే­డిం­గ్‌­లో­కి ప్ర­వే­శిం­చి భా­రీ­గా నష్ట­పో­తు­న్నా­రు. దీ­న్ని కట్ట­డి చే­సేం­దు­కు బడ్జె­ట్‌­లో ఈక్వి­టీ ఫ్యూ­చ­ర్స్‌ లా­వా­దే­వీ­ల­పై వి­ధిం­చే సె­క్యూ­రి­టీ­స్‌ లా­వా­దే­వీల పన్ను (ఎస్‌­టీ­టీ)ను 0.02 శాతం నుం­చి 0.05 శా­తా­ని­కి, ఆప్ష­న్స్‌­పై వి­ధిం­చే ఎస్‌­టీ­టీ­ని 0.1 శాతం నుం­చి 0.15 శా­తా­ని­కి పెం­చే­శా­రు. దీం­తో ఎఫ్‌ అం­డ్‌ ఓ ట్రే­డిం­గ్‌ భా­రం­గా మారి రి­టై­ల్‌ మదు­ప­రు­లు దీ­ని­కి దూ­ర­మ­వు­తా­ర­ని ఆర్థిక మం­త్రి ఆశ.

ఎన్‌ఆర్‌ఐల నుంచి ఆస్తుల కొనుగోలు

ఇప్ప­టి­వ­ర­కు దేశ పౌ­రు­లు ఎవ­రై­నా ప్ర­వాస భా­ర­తీ­యుల (ఎన్‌­ఆ­ర్‌ఐ) నుం­చి ఆస్తు­లు కొ­నా­లం­టే ట్యా­క్స్‌ డి­డ­క్ష­న్‌ అం­డ్‌ కలె­క్ష­న్‌ అకౌం­ట్‌ నం­బ­ర్‌ (టీ­ఏ­ఎ­న్‌) పొం­దా­ల్సి వచ్చే­ది. ఇం­దు­కు చాలా సమయం పట్టి ఆస్తుల రి­జి­స్ట్రే­ష­న్‌ కూడా ఆల­స్య­మ­య్యే­ది. బడ్జె­ట్‌­లో చే­సిన మా­ర్పు­ల­తో ఇక కొ­ను­గో­లు­దా­రు తమ పా­న్‌ నం­బ­రు ద్వా­రా­నే ఈ మొ­త్తా­న్ని మి­న­హా­యిం­చు­కో­వ­చ్చు. ఎన్‌­ఆ­ర్‌­ఐల ఆస్తు­లు కొ­నే­వా­రి­కి ఈ కొ­త్త ని­బం­ధన చాలా మేలు చే­య­నుం­ది.

విదేశీ ఆస్తుల వెల్లడి

వి­దే­శీ ఆస్తు­లు, ఆదా­యాల వి­వ­రా­ల­ను బయట పె­ట్టేం­దు­కు ఆర్థిక మం­త్రి తన కొ­త్త బడ్జె­ట్‌­లో ఆరు నెలల గడు­వు ఇచ్చా­రు. చి­న్న పన్ను చె­ల్లిం­పు­దా­రు­లు, వి­ద్యా­ర్థు­లు, ఉద్యో­గు­లు, ఎన్‌­ఆ­ర్‌­ఐ­లే లక్ష్యం­గా ఆర్థిక మం­త్రి ఈ వె­సు­లు­బా­టు కల్పిం­చా­రు. వె­ల్ల­డిం­చ­ని ఆస్తు­లు లేదా ఆదా­యాల వి­లువ రూ.కోటి లోపు ఉంటే 30 శాతం ట్యా­క్స్‌, 30 శాతం పె­నా­ల్టీ కట్టి ప్రా­సి­క్యూ­ష­న్‌ నుం­చి తప్పిం­చు­కో­వ­చ్చు. పన్ను చె­ల్లిం­చి­న­ప్ప­టి­కీ, రి­ట­ర్ను­ల్లో వె­ల్ల­డిం­చ­ని ఆస్తు­లు లేదా ఆదా­యాల వి­లువ రూ.5 కో­ట్ల వరకు ఉంటే రూ.లక్ష చె­ల్లిం­చి వా­టి­ని క్ర­మ­బ­ద్దీ­క­రిం­చు­కో­వ­చ్చు.

ఐటీఆర్‌ డెడ్‌లైన్‌

ఐటీ­ఆ­ర్‌-1, ఐటీ­ఆ­ర్‌-2 ఫై­లిం­గ్‌ డె­డ్‌­లై­న్ల­లో ఎలాం­టి మా­ర్పు లేదు. ఏటా జూలై నె­లా­ఖ­రు కల్లా ఈ రి­ట­ర్న్‌­లు ఫై­ల్‌ చే­యా­లి. ఆడి­ట్‌ అవ­స­రం లేని చి­న్న చి­న్న వ్యా­పార సం­స్థ­లు, ట్ర­స్టు­లు మా­త్రం ఆగ­స్టు నె­లా­ఖ­రు వరకు ఫై­ల్‌ చే­య­వ­చ్చు.

సవరించిన ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌

చాలా మంది తమ ఐటీ రి­ట­ర్న్‌­లు ఆల­స్యం­గా లేదా తప్పు­ల­తో ఫై­ల్‌ చే­స్తుం­టా­రు. ప్ర­స్తుత ని­బం­ధ­నల ప్ర­కా­రం ఇలాం­టి పన్ను చె­ల్లిం­పు­దా­రు­లు రి­ట­ర్న్‌ ఫై­లిం­గ్‌ గడు­వు ము­గి­సిన 9 నెలల(డి­సెం­బ­రు)లోపు తమ రి­ట­ర్న్‌­ల­ను లేదా సవ­రిం­చిన రి­ట­ర్న్‌­ల­ను కొ­ద్ది­పా­టి పె­నా­ల్టీ చె­ల్లిం­చి ఫై­ల్‌ చే­య­వ­చ్చు. కొ­త్త ఐటీ చట్టం­తో తప్పుల తడ­క­ల­తో రి­ట­ర్న్‌ ఫై­ల్‌ చే­సిన వారు ఇక 12 నె­ల­ల్లో­పు(ఆపై ఏడా­ది మా­ర్చి­లో­గా) సవ­రిం­చిన రి­ట­ర్న్‌ ఫై­ల్‌ చే­య­వ­చ్చు. ఆల­స్యం­గా రి­ట­ర్ను­లు దా­ఖ­లు చే­సే­వా­రి­కి మా­త్రం ఎలాం­టి ఊరట లేదు. ­

Tags:    

Similar News