TESLA: టెస్లాకు రూ.13 లక్షల కోట్ల నష్టం

ట్రంప్‌తో గొడవతో నష్టాల్లో టెస్లా.. భారీగా పతనమైన టెస్లా షేర్లు;

Update: 2025-06-07 05:00 GMT

టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ 152 బిలియన్ డాలర్ల మేర కోసుకుపోయాయి. భారత కరెన్సీలో ఈ విలువ రూ. 13 లక్షల కోట్ల మేర ఉంటుంది. ట్రంప్- మస్క్ మధ్య విబేధాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేర్లు 14 శాతం మేర పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ 1 ట్రిలియన్ మార్క్‌ను మరోసారి కోల్పోయింది. ప్రస్తుతం 916 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. టెస్లా సంపద ఒక్క రోజులో ఈ స్థాయిలో పడిపోవడం కంపెనీ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. ఎప్పుడైతే ఆయన ట్రంప్ పరిపాలనలోనూ మస్క్ జోక్యం చేసుకోవడం ప్రారంభించారో అప్పటినుంచే మస్క్ వ్యాపారాలకు నష్టం రావడం మొదలైంది. టెస్లా అమ్మకాలను వికారం చేస్తుందని గుర్తించిన మస్క్.. వెంటనే ఎస్కేప్ ప్లాన్ వేశారు. ఇటీవల ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఎలాన్ మస్క్. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ నేతలు ఓడిపోయోవారు అని వ్యాఖ్యానించారు అలాగే సెక్స్ రాకెట్ నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అధ్యక్షుడికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనను అభిశంసించాలన్నారు.దీనిపై ట్రంప్ మండిపడ్డారు. మస్క్ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బలవంతంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేలా చేసేందుకు ఒత్తిడి తేవాలనుకుంటున్నారని. దానికి తాను అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో ఇరువురి మాటల యుద్ధ తారస్థాయికి చేరింది. మస్క్‌కు మాత్రం భారీ నష్టం వాటిల్లింది.

288 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన మస్క్

2024 యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ కోసం మస్క్ ఇచ్చిన విరాళం.. 288 మిలియన్ డాలర్లు. ఈమొత్తం ఇండియన్ రుపీస్ లో చెబితే సుమారు 2500 కోట్లు. అందుకే కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని నేరుగా అడిగేశాయి కూడా. ఇకపై మీ విరాళాల వెల్లువ ఇలాగే కొనసాగుతుందా? అని. అలాంటిదేం లేదు. నేను ప్రచారానికి పెద్ద గొప్పగా.. ఖర్చు చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారాయన.

టెస్లాకి పాత చట్టం ప్రకారం 7500 డాలర్ల ట్యాక్స్

ప్రస్తుత విధానం ప్రకారం.. టెస్లా ఈవీల కొనుగోలుపై 7500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ వెసలుబాటు ఉంది. ఉపయోగంలో ఉన్న ఈవీలకు కూడా 4 వేల డాలర్ల ట్యాక్స్ ఫెసిలిటీ ఉంది. గత బైడెన్ హయాంలో అవలంభించిన పన్ను విధానాల కారణంగా.. టెస్లా అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమలైతే.. తాము తమ కస్టమర్లకు ఇచ్చే మినహాయింపులను తగ్గించుకోవల్సి వస్తుంది. దీంతో ఈవీ మార్కెట్ లీడర్ టెస్లాకు తీవ్ర నష్టం మిగిల్చేలా తెలుస్తోంది. 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. ఈ వివాదంతో టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి.

Tags:    

Similar News