Financial Freedom : కోటీశ్వరుడు అవ్వడం చిటికెలో పని.. ఈ 15x15x15 మ్యాజిక్ తెలిస్తే మీరే రాజు.
Financial Freedom : కోటీశ్వరులు అవ్వాలని ఎవరికి ఉండదు? కానీ లక్షల్లో జీతం వచ్చే వాళ్లు కూడా నెలాఖరు వచ్చేసరికి చేతులు చాచే పరిస్థితి కనిపిస్తుంటుంది. సరైన ప్లానింగ్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి కోటి రూపాయలు వెనకేయడం అనేది బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది.. అదే 15x15x15. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీరు కూడా ధనవంతుల జాబితాలో చేరిపోవచ్చు.
ఈ 15x15x15 సూత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు నెలకు 15,000 రూపాయలు పొదుపు చేయాలి. ఈ మొత్తాన్ని వరుసగా 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి (SIP రూపంలో). మీరు పెట్టిన పెట్టుబడిపై ఏడాదికి సగటున 15 శాతం రిటర్న్స్ రావాలి. ఈ మూడు కలిస్తే అంటే 15 వేల పెట్టుబడి, 15 ఏళ్ల కాలం, 15 శాతం లాభం.. మీ చేతిలో 15 ఏళ్ల తర్వాత అక్షరాలా కోటి రూపాయలు (1.01 కోట్లు) ఉంటాయి. ఒకవేళ మీరు ఇదే పనిని 2010లో మొదలుపెట్టి ఉంటే, ఈపాటికే మీరు కోటీశ్వరులు అయ్యేవారు.
చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే.. మార్కెట్‌లో 15 శాతం లాభం గ్యారెంటీగా వస్తుందా? అని. గత 10-15 ఏళ్ల మ్యూచువల్ ఫండ్ల హిస్టరీ చూస్తే, చాలా ఫండ్లు 12 నుంచి 18 శాతం వరకు లాభాలను ఇచ్చాయి. స్టాక్ మార్కెట్ అనేది దీర్ఘకాలంలో ఎప్పుడూ భారీ లాభాలనే ఇస్తుంది. ఒకటి రెండు ఏళ్లలో లాభాలు రాకపోయినా, 15 ఏళ్ల లాంగ్ టర్మ్ పీరియడ్‌లో మాత్రం మీ డబ్బు చక్రవడ్డీ ప్రభావంతో అమాంతం పెరిగిపోతుంది.
ఒకవేళ మీకు 15 శాతం లాభం రాకుండా, కేవలం 12 శాతం మాత్రమే రిటర్న్స్ వచ్చాయనుకుందాం.. అప్పుడు మీ చేతికి సుమారు 75 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ మార్కెట్ ఇంకాస్త తక్కువగా ఉండి 10 శాతం లాభం ఇచ్చినా, మీకు దాదాపు 62 లక్షల రూపాయలు అందుతాయి. అంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, సాధారణ సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్డీల కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన లాభాలను అందిస్తుంది.
పెట్టుబడి విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది క్రమశిక్షణ. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ పోతేనే ఈ మ్యాజిక్ సాధ్యమవుతుంది. చిన్న వయసులోనే పెట్టుబడి మొదలుపెడితే, రిటైర్మెంట్ సమయానికి మీరు ఊహించనంత సంపదను సృష్టించవచ్చు. లక్షల జీతం లేకపోయినా, నెలకు 15 వేల పొదుపుతో కోటి రూపాయల కలని నిజం చేసుకోవడం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది.