Gold: గోల్డ్ కొనేముందు గుర్తుంచుకోవల్సిన అంశాలు..

Gold: ధనత్రయోదశి పేరుతో ఓ గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు.

Update: 2021-11-02 09:31 GMT

Gold: అత్యంత ప్రియమైన విలువైన లోహాలలో బంగారం ఒకటి. బంగారు ఆభరణాలు చూస్తే అతివల కళ్లు మెరుస్తుంటాయి. ధనత్రయోదశి పేరుతో ఓ గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు. పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడల్లా బంగారం కొనుగోలు జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. వివాహాలు, వేడుకల సమయంలో బంగారు ఆభరణాల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది.

తాజా డిజైన్‌ల్ తో వస్తున్న బంగారు ఆభరణాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. బంగారు ఆభరణాల కొనుగోలు విషయానికి వస్తే, మనలో చాలా మంది వివిధ దుకాణాలకు వెళ్లి, ధరలను సరిపోల్చుకుని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ ఆభరణాల గురించి అన్నీ తెలుసనుకున్న వారు కూడా బంగారం కొనుగోలు చేసేటప్పుడు పొరపాట్లు చేయవచ్చు. కాబట్టి, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు.. నిపుణులు సూచించిన జాగ్రత్తలు కొన్ని..

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన చిట్కాలు

1. స్వచ్ఛతను తెలుసుకోండి

బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లను బట్టి నిర్ణయించవచ్చు. 24kt బంగారం 99.9% స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. హాల్‌మార్క్ అనేది స్వచ్ఛతను సూచించే మరొక మార్గం. అందుకే కచ్చితంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే ఎంపిక చేసుకోవాలి.

2. ధర

ఆభరణాల ధర దాని స్వచ్ఛతతో పాటు దానిని ఏ మిశ్రమంతో కలుపుతారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు ధరలను సరిపోల్చడం మంచిది.

3. రంగు

బంగారం రంగు సచ్ఛతను బట్టి మారుతుంది. స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర లోహాలతో కలపడం వల్ల రంగు మారుతుంది కానీ మన దేశంలో పసుపు రంగు బంగారానికి అత్యధిక డిమాండ్ ఉంది.

4. బరువు

మీరు కొనుగోలు చేస్తున్న అసలు బంగారానికి ధర చెల్లించే ముందు దాని బరువును తనిఖీ చేయడం చాలా అవసరం. ఆభరణాలకు ఉపయోగించిన రాళ్ళు కూడా బరువును భారీగా పెంచుతాయి. మళ్లీ వాటికి కూడా మీరు అధిక ధర చెల్లించవలసి ఉంటుంది.

Tags:    

Similar News