Gold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (05-03-2023) ఆదివారం ధరల మాదిరిగానే ఈ రోజు బంగారం, వెండి ధరలు ఉన్నాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,185 ఉంది.

Update: 2023-03-06 04:38 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (06-03-2023 సోమవారం) మార్కెట్లో రూ.5,185గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 51,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,510 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,280 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,600గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,550గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.66.90 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,900గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.70,000 ఉంది. కోల్‌కతాలో రూ.66,900 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (06-03-2023) సోమవారం ఉదయం 10.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News