Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర..

పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది.

Update: 2021-05-26 11:30 GMT

Gold Rate: బుధవారం పసిడి ధర భారీగా పెరిగింది. ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.527 పెరిగి, రూ.48,589కు చేరింది. నిన్న ఇదే బంగారం రూ.48,062 వద్ద ముగిసింది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1,043 పెరిగి రూ.71,775కు చేరింది.

అంతర్జాతీయంగా కూడా పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఔన్సు బంగారం ధర 1,908 డాలర్లు ఉండగా, వెండి ధర ఔన్సుకి 28.7 డాలర్లు పలుకుతోంది. డాలర్ సూచి ఐదు నెలల కనిష్టానికి పడిపోవడంతో మదుపరులు పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ విశ్లేషకుడు తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాదులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50,700 గా ట్రేడ్ అవుతోంది.

Tags:    

Similar News