Schemes for Women : మహిళలకు బెస్ట్ 5 ప్రభుత్వ పథకాలు ఇవే.. పెట్టుబడి మీద 8.2% వరకు గ్యారెంటీ రిటర్న్.
Schemes for Women : నేటి కాలంలో మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాకుండా, తమ ఆర్థిక ప్రణాళిక పై కూడా దృష్టి పెడుతున్నారు. వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని మరింత బలోపేతం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ పథకాలలో పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు, 8.2% వరకు గ్యారెంటీ రిటర్న్స్, పన్ను మినహాయింపు సౌకర్యం కూడా లభిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సర్టిఫికెట్, NSC వంటి ఈ 5 పథకాల పూర్తి వివరాలు, వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం.
1. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో 7.5% గ్యారెంటీ వడ్డీ లభిస్తుంది. కనీసం రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం పూర్తిగా సురక్షితమైనది. పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, జమ చేసిన మొత్తంలో 40% వరకు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌ను పోస్ట్ ఆఫీస్ ద్వారా తెరవవచ్చు.
2. సుకన్య సమృద్ధి యోజన (SSY)
తల్లిదండ్రులు తమ కూతురి భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇందులో అత్యధికంగా 8.2% వార్షిక వడ్డీ లభిస్తోంది. కూతురి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఈ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. ఈ పథకం కూతురి చదువు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును సమకూర్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
3. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ పథకాలు
వయోవృద్ధ మహిళలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పటికీ నమ్మదగిన పెట్టుబడి మార్గంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ బెనిఫిట్ ద్వారా 60 సంవత్సరాలు దాటిన మహిళలకు, సాధారణ ఖాతాదారుల కంటే 0.50% వరకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. దీనితో పాటు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కూడా మంచి రాబడిని ఇచ్చే మరొక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక.
4. సుభద్ర యోజన (ఒడిశా రాష్ట్ర ప్రత్యేక పథకం)
ఇది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడి మహిళల కోసం ప్రారంభించిన పథకం. ఈ పథకం ఒడిశా రాష్ట్రంలో నివసించే 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల కోసం ఉద్దేశించబడింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు 5 సంవత్సరాల కాలంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం నేరుగా అందించబడుతుంది.
5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)
ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించబడే మరొక ఫిక్స్ డ్ టర్న్ డిపాజిట్ పథకం. NSCలో ఒక నిర్ణీత వడ్డీ రేటు లభిస్తుంది, అంటే రిటర్న్స్ గ్యారెంటీ. ఈ పథకం కాలపరిమితి 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.