TURKIYE:తుర్కియేలో అజియో, మింత్రా విక్రయాలు బంద్‌

తుర్కియే బహిరంగంగా పాక్ కు మద్దతు తెలిపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన;

Update: 2025-05-18 03:30 GMT

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కు విరుద్ధంగా తుర్కియే బహిరంగంగా పాక్ కు మద్దతు తెలిపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వస్తోంది. తుర్కియే ఉత్పత్తులపై బహిష్కరణకు భారత వినియోగదారులు, వ్యాపార వర్గాలు పెద్దఎత్తున స్పందిస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ట్రెండ్ అవుతుండగా, ఇప్పటికే ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, అజియో తుర్కిష్ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాయి.

ఆన్‌లైన్ వాణిజ్యంలో కీలక మార్పులు

అజియో తన వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్న తుర్కియేకు చెందిన కోటాన్‌, ఎల్‌సీ వైకికి, మావి బ్రాండ్ల దుస్తుల విక్రయాన్ని ఆపేసింది. అంతేకాదు, తుర్కియేలో ఉన్న కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు రిలయన్స్ గ్రూప్ అధికారి వెల్లడించారు. ఇదే విధంగా మింత్రా కూడా తుర్కీ బ్రాండ్లకు ప్లాట్‌ఫామ్‌లో చోటివ్వడం లేదని తెలిపింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక వాణిజ్యానికి భారీగా దెబ్బతీయనున్నాయి.

వ్యాపార వర్గాల ఉక్కుపాదం

తుర్కియే, అజర్‌బైజాన్‌లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వ్యాపార వర్గాలు గళమెత్తుతున్నాయి. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. భారత ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాలు కూడా ఇకపై ఆ దేశాల్లోని సంస్థలతో సంబంధాలు పెట్టుకోబోమని ప్రకటించాయి.

భద్రతా అనుమతులు కూడా రద్దు

తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ సంస్థకు భారత విమానాశ్రయాల్లో భద్రతా సేవలు అందించే అనుమతిని కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది. దీంతో ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి.

ప్రజా మద్దతుతో వేగంగా మారుతున్న వాతావరణం

సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తుర్కీ ఉత్పత్తులను వాడొద్దంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, దేశభక్తి భావాలు కలిగిన యువత జతకడుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు దేశం మొత్తంగా మద్దతు తెలుపుతుండగా, భారత్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ దేశానికీ ఉపశమనముండదనే సంకేతాన్ని భారత్ పంపుతోంది. **తుర్కియే నుంచి యాపిల్స్ దిగుమతిని పుణే వ్యాపారులు బహిష్కరించారు. ఫలితంగా పుణెలోని మార్కెట్ యార్డుల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. పుణె మార్కెట్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి యాపిల్స్​ను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది.

Tags:    

Similar News