TVS Raider : టీవీఎస్ నుంచి నయా బైక్.. హైటెక్ ఫీచర్లతో అదరగొట్టింది.. ఇకపై రైడింగ్ మరింత థ్రిల్లింగ్.

Update: 2025-10-07 07:00 GMT

TVS Raider : టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ టీవీఎస్ రైడర్‎లో సరికొత్త, అడ్వాన్స్‌డ్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌లు డ్యూయల్ డిస్క్ బ్రేక్, సింగిల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు, ఈ 125CC కమ్యూటర్ సెగ్మెంట్‌లో మొదటిసారిగా లభిస్తున్న కొన్ని వినూత్న ఫీచర్లను కూడా తీసుకొచ్చాయి. కొత్తగా లాంచ్ అయిన SXC Dual Disc, TFT Dual Disc మోడళ్లు బూస్ట్ మోడ్, గ్లైడ్-థ్రూ-టెక్నాలజీ వంటి ఫీచర్లతో రైడర్‌ను మరింత లేటెస్టుగా మార్చేశాయి.

టీవీఎస్ రైడర్ కొత్త మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. SXC Dual Disc వేరియంట్ ధర రూ.93,800 కాగా, TFT Dual Disc వేరియంట్ ధర రూ.95,600గా ఉంది. ఈ ధరలు ఈ సెగ్మెంట్‌లో అత్యంత పోటీని పెంచుతున్నాయి. బైక్ డిజైన్‌లో భాగంగా, మెటాలిక్ సిల్వర్ కొత్త రంగుతో పాటు, స్పోర్టీ రెడ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. కస్టమర్ల సౌలభ్యం కోసం 99+ కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన TFT కన్సోల్ లేదా 85 ఫీచర్లతో రివర్స్ LED డిస్‌ప్లే.. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

ఇంజిన్, ప్రత్యేకమైన ఫీచర్లు

రైడర్‌లో 125సీసీ, 3-వాల్వ్ ఇంజన్ (5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో) యథావిధిగా ఉంది. ఇది 6,000 RPM వద్ద 11.2 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు ఇప్పుడు 'iGO అసిస్ట్' ఫీచర్‌తో పాటు సెగ్మెంట్‌లోనే తొలిసారిగా బూస్ట్ మోడ్ సౌకర్యం లభించింది. ఇది తక్షణ శక్తిని అందించడం ద్వారా టార్క్ స్థాయిని 6,000 RPM వద్ద 11.75 NM కి పెంచుతుంది. గ్లైడ్-థ్రూ-టెక్నాలజీ సాయంతో బైక్ తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు థ్రాటిల్ ఇవ్వకుండానే సాఫీగా ముందుకు కదులుతుంది. ఇది మెరుగైన మైలేజ్‌కు తోడ్పడుతుంది.

125CC సెగ్మెంట్‌లో మొదటిసారిగా రైడర్ బైక్‌కు ముందు, వెనుక డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు లభిస్తున్నాయి. మంచి సేఫ్టీ, కంట్రోల్ కోసం దీనికి సింగిల్-ఛానల్ ABS సపోర్టు కూడా ఇచ్చారు. మెరుగైన గ్రిప్ కోసం టైర్లు కూడా వెడల్పుగా (ముందు 90/90-17, వెనుక 110/80-17) మార్చారు. టీవీఎస్ స్మార్ట్‌ఎక్స్‌ఒనెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో ఉంది. దీని ద్వారా వాయిస్ అసిస్ట్, ట‌ర్న్-బై-ట‌ర్న్ నావిగేషన్, కాల్స్, నోటిఫికేషన్ మేనేజ్‌మెంట్ వంటి స్మార్ట్ ఫీచర్లను రైడర్ సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Tags:    

Similar News