Twitter CEO: ట్విటర్‌కు సీఈఓగా భారతీయుడు పరాగ్ అగర్వాల్..

Twitter CEO: టెక్‌ ప్రపంచంలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది.

Update: 2021-11-30 01:15 GMT

Twitter CEO (tv5news.in)

Twitter CEO: టెక్‌ ప్రపంచంలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఈ అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూలలో రీసెర్చ్‌ చేశారు. 2011లో ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. గత పదేళ్లుగా ట్విటర్‌లో పనిచేస్తున్న ఆయన.. ట్విటర్‌ టెక్నికల్‌ స్ట్రేటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కంజ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్స్‌ల బాధ్యతలు చూస్తున్నారు.

Tags:    

Similar News