Twitter CEO: ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ జీతం ఎంతంటే..?

Twitter CEO: ట్విటర్‌కి అధినేతగా ఉండేది ఒక ఇండియనే అని తెలిసిన తర్వాత చాలామంది ఇండియన్స్ గర్వంగా ఫీల్ అయ్యారు.

Update: 2021-11-30 08:33 GMT

Parag Agarawal (tv5news.in)

Twitter CEO: ట్విటర్.. మనం ఏదైనా విషయం మనకు తెలిసిన వారికి, తెలియని వారికి అని తేడా లేకుండా అందరికీ చెప్పాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చే సోషల్ మీడియా హ్యాండిల్ ఇదే. అలాంటి ట్విటర్‌కి అధినేతగా ఉండేది ఒక ఇండియనే అని తెలిసిన తర్వాత చాలామంది ఇండియన్స్ గర్వంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అతడి ట్విటర్ సీఈఓగా తన జీతం ఎంత ఉంటుందో అని కొందరు ఆరాతీస్తున్నారు.

ట్విటర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరాగ్ అగర్వాల్‌కు సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లను జీతంగా సంస్థ ఇవ్వనుంది. వీటితో పాటు తనకు బోనస్‌లు కూడా లభిస్తాయి. అందులో ముఖ్యంగా 12.5 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు తన సొంతమవుతాయి. వీటిని మూడు నెలల గ్యాప్‌లో 16 క్వార్టర్స్‌లో తనకు అందిస్తారు. ఫిబ్రవరీ 1 నుండి ఈ షేర్స్‌ను తనకు అందిస్తారు.

12.5 మిలియన్ల విలువైన షేర్లతో పాటు మరికొన్ని షేర్స్‌ను కూడా ట్విటర్.. పరాగ్‌కు అందిస్తుంది. తన పర్ఫార్మెన్స్‌ను బట్టి ఈ షేర్స్‌ పెరగడం, తగ్గడం ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు ట్విటర్ సీఈఓగా పనిచేసిన సంస్థ కో ఫౌండర్ జాక్ డార్సే ఏడాదికి 1.40 మిలియన్ డాలర్ల జీతాన్ని అందుకునేవాడు. తనకంటే పరాగ్‌కు జీతం తక్కెువే అయినా.. కేవలం పదేళ్ల అనుభవంతో ట్విటర్‌లాంటి సంస్థకు సీఈఓ అవ్వడం అంటే మాటలు కాదని చాలామంది తనను ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News