ULAA: దిగ్గజాలను దాటిన స్వదేశీ బ్రౌజర్..!

జోహో నుంచి సరికొత్త బ్రౌజర్.. యాప్ స్టోర్‌లో అగ్రస్థానంలో ఉలా బ్రౌజర్.. గోప్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ఉలా.. ప్రభుత్వ ఛాలెంజ్‌లో విన్నర్‌గా నిలిచిన ఉలా

Update: 2025-10-05 05:30 GMT

వా­ట్సా­ప్ వంటి మె­సే­జిం­గ్ యా­ప్స్‌­కు ధీ­టు­గా 'అ­ర­ట్టై' యా­ప్‌­ను వి­జ­య­వం­తం­గా లాం­చ్ చే­సిన జోహో ఇప్పు­డు సరి­కొ­త్త బ్రౌ­జ­ర్‌­ని తీ­సు­కొ­చ్చిం­ది. 'ఉలా బ్రౌ­జ­ర్' పే­రు­తో జోహో తీ­సు­కొ­చ్చిన ఈ యాప్ ప్ర­స్తు­తం యాప్ స్టో­ర్ చా­ర్టు­లో అగ్ర­స్థా­నం­లో ని­లి­చిం­ది. ఇది కూడా అర­ట్టై తర­హా­లో­నే గూ­గు­ల్ క్రో­మ్‌, ఆపి­ల్ సఫా­రీ వంటి అం­త­ర్జా­తీయ ది­గ్గజ బ్రౌ­జ­ర్ల­కు పో­టీ­గా ని­లు­స్తోం­ది. పూ­ర్తి స్వ­దే­శీ ఇం­జ­నీ­ర్ల మే­ధ­తో ఇవి రూ­పొం­ద­టం అభి­నం­ద­నీ­యం.

 ప్రత్యేకతలు ఇవే:

ఉలా బ్రౌజర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్, లినక్స్ వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లో ఉంది. దీని గోప్ప ఫీచర్ గోప్యత. ఉలా బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు, స్టోర్ చేయదు ఇంకా ఇతరులకు విక్రయించదు. గూగుల్ ప్రకటనల కోసం డేటాను సేకరిస్తుంది, కానీ ఉలా పూర్తిగా వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది.

స్మార్ట్ గ్రూపింగ్

ట్యా­బ్స్ మే­నే­జ­ర్ ద్వా­రా వి­ని­యో­గ­దా­రు­లు పే­జీ­ల­ను పిన్ చే­య­డం, పాజ్ చే­య­డం, సేవ్ చే­య­డం చే­య­వ­చ్చు. స్మా­ర్ట్ గ్రూ­పిం­గ్ ఫీ­చ­ర్ ఆటో­మే­టి­క్‌­గా ట్యా­బ్స్‌­ను గ్రూ­పు­లు­గా వి­భ­జి­స్తుం­ది, అవ­స­ర­మైన పేజీ త్వ­ర­గా కను­గొ­న­డా­ని­కి సహా­య­ప­డు­తుం­ది. ఉలా సిం­క్ పా­స్వ­ర్డ్స్, బు­క్‌­మా­ర్కు­లు, సె­ర్చ్ హి­స్ట­రీ, సె­ట్టిం­గ్స్‌­ను పలు పరి­క­రాల మధ్య షేర్ చే­స్తుం­ది. ఉలా­లో బి­ల్ట్-ఇన్ అడ్స్ బ్లా­క­ర్ ఉంది, ఇది ట్రా­క­ర్స్, మో­స­పూ­రిత ప్ర­క­ట­న­లు,పాప్-అప్స్, మా­ల్వే­ర్‌­ని ని­రో­ధి­స్తుం­ది.

 యాడ్ బ్లాకర్, ట్రాకర్ ప్రొటెక్షన్

బ్రౌ­జిం­గ్ అను­భ­వం సు­ర­క్షి­తం­గా ఉం­డేం­దు­కు ఇం­దు­లో యాడ్ బ్లా­క­ర్లు ఇంకా ట్రా­క­ర్ ప్రొ­టె­క్ష­న్ ఇన్-బి­ల్ట్ గా ఉన్నా­యి. ఈ బ్రౌ­జ­ర్‌­లో ఐదు రకాల మో­డ్‌­లు ఉన్నా­యి. వర్క్, పర్స­న­ల్, కి­డ్స్, డె­వ­ల­ప­ర్ (సా­ఫ్ట్‌­వే­ర్ డె­వ­ల­ప­ర్ల కోసం).

పాస్వర్డ్, బుక్‌మార్క్ మేనేజ్‌మెంట్

ఉలా­లో పా­స్వ­ర్డ్ మే­నే­జ­ర్, బు­క్‌­మా­ర్క్స్ మే­నే­జ­ర్ ఉన్నా­యి, వీ­టి­వ­ల్ల వి­ని­యో­గ­దా­రు­లు వి­వ­రా­ల­ను సు­ర­క్షి­తం­గా సేవ్, ఎడి­ట్, ఆర్గ­నై­జ్ చే­య­వ­చ్చు. అలా­గే స్క్రీ­న్ క్యా­ప్చ­ర్ టూల్ కలి­గి ఉంది, ఇది పూ­ర్తి లేదా భా­గ­స్వా­మిక స్క్రీ­న్‌­షా­ట్ తీ­సు­కో­వ­డా­ని­కి సహా­య­ప­డు­తుం­ది. ఇది క్రో­మ్ ఎక్స్టె­న్ష­న్స్‌­కు మద్ద­తు ఇస్తుం­ది. కా­బ­ట్టి వి­ని­యో­గ­దా­రు­లు సొంత అను­భ­వం కోసం వా­టి­ని ఉప­యో­గిం­చ­వ­చ్చు.

ప్రభుత్వ గుర్తింపు

ఎల­క్ట్రా­ని­క్స్ & ఇన్ఫ­ర్మే­ష­న్ టె­క్నా­ల­జీ మం­త్రి­త్వ శాఖ ని­ర్వ­హిం­చిన 'ఇం­డి­య­న్ వెబ్ బ్రౌ­జ­ర్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ఛా­లెం­జ్‌­'­ను కూడా ఉలా బ్రౌ­జ­ర్ గె­లు­చు­కుం­ది. యూ­జ­ర్లు ప్ర­తి­సా­రి లా­గి­న్ చే­య­కుం­డా­నే జోహో యా­ప్‌­లో సు­ల­భం­గా, సు­ర­క్షి­తం­గా సైన్ ఇన్ చే­య­వ­చ్చు. అలా­గే, వి­విధ బ్రౌ­జ­ర్ మో­డ్‌­లు జోహో యా­ప్స్ కోసం AI- ఆధా­రిత సె­ర్చ్ సి­స్ట­మ్ 'జి­యా' తో కూడా కనె­క్ట్ అయి ఉం­టా­యి. ప్ర­స్తు­తా­ని­కి, ఉలా బ్రౌ­జ­ర్‌­లో గూ­గు­ల్ క్రో­మ్ వంటి బ్రౌ­జ­ర్‌­ల­లో ఉన్న ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ ఫీ­చ­ర్లు లేవు. బ్రౌ­జ­ర్ రే­సు­లో గూ­గు­ల్ క్రో­మ్‌­ను అధి­గ­మిం­చా­లం­టే, ఉలా బ్రౌ­జ­ర్‌­లో మరి­న్ని అధు­నా­త­న­మైన AI ఫీ­చ­ర్ల­ను తీ­సు­కు­రా­వా­ల్సి ఉం­టుం­ది.

Tags:    

Similar News