V REELS: భారత మార్కెట్‌లో ‘వీరీల్స్’ ప్రభంజనం
క్రియేటర్ ఎకానమీకి కొత్త ఊపు: వీరీల్స్... వినియోగదారుల నియంత్రణకే పెద్దపీట.. భారతీయ క్రియేటర్లతోనే రూపుదిద్దుకున్న ప్లాట్‌ఫామ్
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆదాయ వనరులుగా మారుతున్నాయి. అయితే, డేటా గోప్యత, క్రియేటర్లకు సరైన గుర్తింపు లేకపోవడం వంటి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, భారతీయ క్రియేటర్ ఎకానామిని మలుపు తిప్పేందుకు ‘వీరీల్స్’ (Vreels) సరికొత్త ఫీచర్లతో రంగంలోకి దిగింది. వినియోగదారుల నియంత్రణకే పెద్దపీట వేస్తూ, సృజనాత్మకతను ఆదాయంగా మార్చుకునే అద్భుత అవకాశాలను ఈ వేదిక కల్పిస్తోంది.
క్రియేటర్లే కేంద్రబిందువుగా..
సాధారణంగా పెద్ద కంపెనీలు ఫీచర్లను ప్రవేశపెట్టిన తర్వాత యూజర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. కానీ, వీరీల్స్ బృందం క్షేత్రస్థాయిలో క్రియేటర్లను నేరుగా కలిసి, వారి అవసరాలను తెలుసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను ([www.vreels.com](http://www.vreels.com)) తీర్చిదిద్దింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక పోటీలు, నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు తమ ప్రొఫైల్‌లో కాలేజీ పేరును అప్‌డేట్ చేయడం ద్వారా తోటి విద్యార్థులతో సులభంగా అనుసంధానం కావచ్చు.
ఆకర్షణీయమైన ఆదాయ మార్గాలు
క్రియేటర్లను ప్రోత్సహించేందుకు వీరీల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్‌ఫామ్‌పై 10,000 మంది ఫాలోవర్లను చేరుకున్న ప్రతి క్రియేటర్‌కు రూ. 10,000 నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించనుంది. దీనికి ఎటువంటి పరిమితులు లేకపోవడం విశేషం. అంతేకాకుండా, 2026లో ‘వీరీల్స్ షాప్’ ప్రారంభం కానుంది. ఇది ఈ-కామర్స్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించబోతోంది. వినియోగదారులు వీడియోలు చూస్తూనే ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు లేదా బిడ్డింగ్ ద్వారా తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. చిన్న వ్యాపారులు తమ రీల్స్ ద్వారా బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
వినూత్న ఫీచర్లు:
వీరీల్స్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఫీచర్ ‘మెమొరీ క్యాప్సుల్’. వినియోగదారులు తమ ఆత్మీయుల కోసం రహస్య సందేశాలను లేదా జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో భద్రపరిచి, నిర్ణీత సమయానికి (పుట్టినరోజులు లేదా వార్షికోత్సవాలు) మాత్రమే ఓపెన్ అయ్యేలా ‘టైమ్ లాక్’ చేయవచ్చు. ఇక PixPouch ఫీచర్ ద్వారా ఫోటోల సేకరణ, నిర్వహణ సులభతరం అవుతుంది. షార్ట్ వీడియోలు (Reels), చాటింగ్, హై-క్వాలిటీ వీడియో కాల్స్ అన్నీ ఒకే యాప్‌లో లభిస్తాయి.
భద్రతే ప్రాధాన్యత
డేటా లీక్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, వీరీల్స్ అత్యాధునిక ఎన్క్రిప్షన్ సాంకేతికతను వాడుతోంది. యూజర్ల కంటెంట్‌పై వారికే పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎవరు తమ పోస్ట్‌లను చూడాలి, ఎవరు చూడకూడదు అనే అంశంలో యూజర్‌దే అంతిమ నిర్ణయం. ప్రస్తుతం 22 దేశాల్లో బీటా వర్షన్లో అందుబాటులో ఉన్న ఈ యాప్, గూగుల్ ప్లేస్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లలో లభిస్తోంది. స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా వీరీల్స్ అడుగులు వేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో భద్రతతో కూడిన సృజనాత్మక విప్లవానికి వీరీల్స్ నాంది పలుకుతోంది; ఇది కేవలం యాప్ మాత్రమే కాదు, ప్రతి క్రియేటర్ కలల ప్రయాణం.