Flat vs House: సిటీలో ఫ్లాటా.. శివార్లలో ఇల్లా.. ఏది బెటర్

Flat vs House: మధ్యతరగతి వాసికి మహత్తర అవకాశం అంటూనే ప్లాట్లు, ఫ్లాట్ ధరలు ఆకాశంలో ఉంటున్నాయి.

Update: 2022-02-19 02:00 GMT

Flat vs House: సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉద్యోగంలో జాయిన్ అయిన్ మొదటి రోజు నుంచి ఉన్న కల.. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, పొదుపు చేసి ఎలాగో కొంత డబ్బు సమకూర్చుకుంటారు.. అంతలోనే డైలమా.. ఆకర్షించే ప్రకటనలు.. వద్దన్నా ఇచ్చే ఇరుగు పొరుగు సలహాలు.. వెరసి ఓ కన్ఫ్యూజ్ స్టేటస్.. ఎలా నిర్ణయం తీసుకోవాలో బోధ పడదు.. ఈలోపు భార్యామణి రుసరుసలు.. ఈ ఏడాది అయినా ఇల్లు కొనే భాగ్యం ఉందా అని..

మధ్యతరగతి వాసికి మహత్తర అవకాశం అంటూనే ప్లాట్లు, ఫ్లాట్ ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతారు.. అంతలోనే మరో కన్ఫ్యూజన్. ఆఫీస్‌కి దగ్గర్లో ఫ్లాట్ కొంటే ట్రాఫిక్ నుంచి తప్పించుకుని ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. అదే ఊరి శివార్లలో ఇండిపెండెంట్ హౌస్ కొంటే భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుంది.. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది.

ఏదైనా మంచిదే.. ఇంట్లో వాళ్లంతా ఒకే అభిప్రాయంతో ఉండడం ముఖ్యం. ఇప్పుడు శివార్లలో కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక మెట్రోలు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు గణనీయంగా పెరిగాయి.. ఏరియా బావుండి, ఇరుగు పొరుగు ఎలా ఉన్నారో చూసుకుంటే శివార్లలో ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు..

ఇక సిటీలో తీసుకోవాలనుకుంటే మరి చిన్న అపార్ట్‌మెంట్‌లు కాకుండా, ముఖ్యంగా పిల్లలు, ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నప్పుడు కాస్త పెద్ద అపార్ట్‌మెంట్‌లో తీసుకునేందుకు మొగ్గు చూపాలి.. పలకరించే వాళ్లు, పట్టించుకునే వాళ్లు ఉంటారు. లేకపోతే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. జీవితంలో ఒకసారే కొనే ఇల్లు అది మీకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లవుతుంది. 

Tags:    

Similar News