YEAR END: భారత ఆర్థిక వ్యవస్థను శాసించిన కంపెనీలు 

మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్... కీలకంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు.. తర్వాత టెలికాం, ఫైనాన్స్, ఇన్‌ఫ్రా...

Update: 2025-12-21 10:30 GMT

భారత ఆర్థిక వ్య­వ­స్థ­లో కీలక పా­త్ర పో­షి­స్తు­న్న బ్యాం­కిం­గ్, ఎన­ర్జీ, టె­క్నా­ల­జీ, ఫై­నా­న్స్ రం­గా­ల్లో­ని ది­గ్గజ కం­పె­నీ­లు 2025 సం­వ­త్స­రం ము­గి­సే సమ­యా­ని­కి మా­ర్కె­ట్ క్యా­పి­ట­లై­జే­ష­న్ (మా­ర్కె­ట్ వి­లువ) ఆధా­రం­గా అగ్ర­స్థా­నం­లో ని­లి­చా­యి. రి­ల­య­న్స్ ఇం­డ­స్ట్రీ­స్ మొ­ద­టి స్థా­నం­లో ఉం­డ­గా, ఆ తర్వాత హె­చ్‌­డీ­ఎ­ఫ్‌­సీ బ్యాం­క్, ఐసీ­ఐ­సీఐ బ్యాం­క్ వంటి ప్ర­ముఖ బ్యాం­కు­లు, టె­లి­కాం, ఐటీ, ఫై­నా­న్స్, ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చ­ర్ ది­గ్గ­జా­లు టాప్ 10 జా­బి­తా­లో ఉన్నా­యి.

మార్కెట్ విలువలో భారత అగ్రగామి కంపెనీలు (2025 చివరి నాటికి)

భారతదేశ ఆర్థిక రంగాన్ని శాసించిన టాప్ 9 కంపెనీల జాబితా, వాటి మార్కెట్ విలువలు ఆధారంగా..

*  రిలయన్స్ ఇండస్ట్రీస్ -రూ.20.85 లక్షల కోట్లు

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- రూ.15.87 లక్షల కోట్లు

* భారతీ ఎయిర్‌టెల్-రూ.12.84 లక్షల కోట్లు

* టీసీఎస్ -రూ.11.65 లక్షల కోట్లు

* ఐసీఐసీఐ బ్యాంక్ -రూ.9.95 లక్షల కోట్లు

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -రూ.7.65 లక్షల కోట్లు

* ఇన్ఫోసిస్ -రూ.6.71 లక్షల కోట్లు

* బజాజ్ ఫైనాన్స్-రూ.6.33 లక్షల కోట్లు

* లార్సెన్ & టూబ్రో (L&T)- రూ.5.42 లక్షల కోట్లు

ఎనర్జీ, టెలికాం ఆధిపత్యం

రి­ల­య­న్స్ ఇం­డ­స్ట్రీ­స్ (RIL) రూ.20.85 లక్షల కో­ట్ల­తో భారత మా­ర్కె­ట్ క్యా­ప్ కి­రీ­టా­న్ని ని­ల­బె­ట్టు­కుం­ది. ఆయి­ల్ అండ్  గ్యాస్, పెట్రోకెమికల్స్, జియో (టెలికాం), రిటైల్ వంటి విభిన్న రంగాల్లో RIL తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్ రూ.12.84 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలవడం టెలికాం రంగంలో దాని స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది. మెట్రో నగరాల్లో 5G విస్తరణ, ఎంటర్‌ప్రైజ్ సేవల్లో విస్తరణ ఎయిర్‌టెల్ వృద్ధికి ప్రధాన కారణాలు.

 బ్యాంకింగ్ దిగ్గజాలు

మా­ర్కె­ట్ క్యా­ప్‌­లో బ్యాం­కిం­గ్ రంగం అగ్ర­భా­గాన ని­లి­చిం­ది. హె­చ్‌­డీ­ఎ­ఫ్‌­సీ బ్యాం­క్.. ₹ 15.87 లక్షల కో­ట్ల మా­ర్కె­ట్ వి­లు­వ­తో రెం­డో స్థా­నం­లో ని­లి­చిన ఈ సం­స్థ, రూ.16.5 లక్షల కో­ట్ల బల­మైన డి­పా­జి­ట్ బే­స్‌­తో భా­ర­త­దే­శం­లో అతి­పె­ద్ద ప్రై­వే­ట్ బ్యాం­క్‌­గా ఉంది. రూ . 9.95 లక్షల కో­ట్ల­తో ఐదో స్థా­నం­లో ని­లి­చిన ఐసీ­ఐ­సీఐ, 120 మి­లి­య­న్ల రి­టై­ల్ కస్ట­మ­ర్ల­తో డి­జి­ట­ల్ బ్యాం­కిం­గ్ ప్లా­ట్‌­ఫా­ర­మ్‌­లో దూ­సు­కు­పో­తోం­ది. ఇక రూ,7.65 లక్షల కో­ట్ల­తో ఆరో స్థా­నం­లో ఉన్న ఎస్‌­బీఐ, ప్ర­భు­త్వ మద్ద­తు, స్థి­ర­మైన ని­ధు­ల­తో దే­శం­లో అతి­పె­ద్ద ప్ర­భు­త్వ రంగ బ్యాం­క్‌­గా ని­లి­చిం­ది.

ఐటీ రంగంలో పోటీ

ఐటీ రంగంలో నిలకడగా పనితీరు కనబరిచిన రెండు దిగ్గజాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టీసీఎస్ .. రూ.11.65 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్, ఉద్యోగుల సంఖ్య పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ. ఇక ఇన్ఫోసిస్ రూ.6.71 లక్షల కోట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

Tags:    

Similar News