zepto: కాలం తీరిన ప్యాకెట్లు.... బూజు పట్టిన పదార్థాలు
జెప్టో లైసెన్స్ రద్దు చేసిన మహారాష్ట్ర;
టెన్ మినిట్స్ డెలివరీ అంటూ కస్టమర్స్ ను బాగా అట్రాక్ట్ చేసిన జెప్టో మెల్లగా షాకివ్వడం కూడా స్టార్ట్ చేసింది. హైజీనిక్ స్టోరేజ్ తో ఫ్రెష్ కూరగాయలు, పండ్లతో పాటు గ్రోసరీస్ ఆర్డర్ చేసిన పది నిమిషాలలో డెలివరీ చేస్తామని మంచి మార్కెట్ షేర్ సంపాదించిన ఈ సంస్థ.. తాజాగా ఫ్రెష్ అనే పదాన్ని పక్కన పెట్టి బూజు పట్టి.. కుళ్లిపోయిన వస్తువులను డెలివరీ చేసి కస్టమర్స్ కు షాకిచ్చింది. కస్టమర్లకు నాణ్యతలేని వస్తువులను డెలివరీ చేయడంతో ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ జెప్టో లైసెన్స్ రద్దు చేసింది. మహారాష్ట్రలో జెప్టో ఆఫీస్ లలో సోదాలు నిర్వహించిన అధికారులు.. కిరణాకార్ట్ టెక్నాలజీ లైసెన్స్ ను సస్పెండ్ చేసింది. ముంబైలోని ధారావి ప్రాంతంలో ఉన్న జెప్టో ఆఫీసు లైసెన్స్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు సేఫ్ అండ్ హైజీనిక్ ప్రాడక్ట్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జెప్టో.. నిబంధనలు పాటించకపోవడం లేదని ఫిర్యాదులతో లేటెస్ట్ గా సోదాలు నిర్వహించి ఎన్ఐఏ షాకిచ్చింది .
సోదాల్లో విస్తుపోయే నిజాలు
ముంబైలో జరిగిన ఎన్ఐఏ సోదాలలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఫుడ్ ఐటెమ్స్ పైన బూజు పేరుకుపోవడం.. వస్తువులు, కూరగాయలు.. నిల్వ ఉన్న మురుగునీటి దగ్గర భద్రపరుస్తున్నారు. ఎలాంటి శుభ్రత లేకుండా .. నిల్వ ఉంచే స్థలంలో సరైన టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయడం లేదు. కూరగాయలు, వస్తువులను తడిసిన చిత్తడి చిత్తడి ఉన్న ఫ్లోర్ లపైనే నిల్వఉంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ ఇచ్చిన సమాచారం మేరకు ముంబై ధారావిలోని జెప్టో వేర్ హౌజ్ పై దాడులు నిర్వహించారు అధికారులు. లైసెన్స్ ప్రకారం పాటించాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ ఉల్లంఘించినందున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ హైజీనిక్ పదార్థాలు మెయింటైన్ చేస్తూ.. నిబంధనలు అన్ని పాటించే సమయం వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసిస్టెంట్ కమిషనర్ అనుపమ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.
జెప్టో వివరణ ఎలా ఉందంటే?
లైసెన్స్ సస్పెన్షన్ తర్వాత జెప్టో ఒక ప్రకటన విడుదల చేసింది. “జెప్టోలో ఆహార సేఫ్టీ, నీట్ నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు తేలింది. లైసెన్స్ క్యాన్సిల్ పై ఇప్పటికే అంతర్గత సమీక్షను ప్రారంభించాము. మా సంస్థలో జరిగిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి, మా వినియోగదారులకు సురక్షితమైన నాణ్యత గల ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తున్నాం. త్వరలోనే మళ్లీ లైసెన్స్ ను తిరిగి పొంది యథావిధిగా సేవలను కొనసాగిస్తాం. మమ్మల్ని ఆదరిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు. మళ్లీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నం చేస్తాం” అని జెప్టో ప్రతినిధి తెలిపారు.