'భవిష్యత్తు కు గ్యారెంటీ' పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు చంద్రబాబు.

Update: 2023-05-28 15:53 GMT

రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరిట  మ్యానిఫెస్టో విడుదల చేశారు  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. మహానాడు వేదికగా 2023 ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.రిలీజ్ అయిన మ్యానిఫెస్టోలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహిళల కోసం మహాశక్తి,  ఆడబిడ్డ నిది కింద మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500వేస్తామని చెప్పారు.  18ఏళ్ల నుంచి 59ఏళ్ల వరకు ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే వారదరికీ రూ.1500 అందుతుందని చెప్పారు. 'తల్లికి వందనం' పేరుతో ప్రతీ బిడ్డా చదువుకునేందుకు ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదనే నిబంధన పెడతామని చెప్పారు. దీపం పథకం కింద ఏటా 3సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం యువగళం స్కీమ్ ను తీసుకురానున్నట్లు చెప్పారు.  యువగళం నిధి కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. 



1. మహాశక్తి పథకం కింద...

   1) ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500  -ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు

   2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు

  3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

  4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం

2. యువగళం:-యువగళం విన్నాం - 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు – యువగళం నిధి కింద నెలకు రూ.3000

3.అన్నదాత-అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు.

4. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు

5. బిసిలకు రక్షణ చట్టం

6. పూర్ టు రిచ్: పేదలను సంపన్నులను చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తాం.

Tags:    

Similar News