20 Years Of Santosham : 20 ఏళ్ల సంతోషం.. దశరథ్ కోసం ఎనిమిది నెలలు వెయిట్ చేసిన నాగ్..!
20 Years Of Santosham : టాలెంట్ ఉన్న దర్శకులకి ఛాన్స్ ఇవ్వడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడు ముందే ఉంటారు.. అలా సంతోషం సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగ్.;
20 Years Of Santosham : టాలెంట్ ఉన్న దర్శకులకి ఛాన్స్ ఇవ్వడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడు ముందే ఉంటారు.. అలా సంతోషం సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగ్. ఏకంగా అతనికోసం ఓ ఎనమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా ఉన్నారు నాగార్జున. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ సినిమా 2002 మే 9న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా సంతోషం సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..!
#2DecadesForSantosham
— Gopi Mohan (@Gopimohan) May 9, 2022
A special film in my life.2 Decades for my writing. An outstanding experience.
Thank u @iamnagarjuna garu@directordasarad @shriya1109 @iamgracysingh #KLNarayana ji #GopalReddy ji @rppatnaik & #Santosham Team.
A big Thanks to u all.The journey continues.. pic.twitter.com/ESxbgmWS6Y
ముందుగా నాగర్జునతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు నిర్మాతలు పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డి.. నాగార్జున డేట్స్ కూడా ఇచ్చేశాడు..కానీ వారి వద్ద కథ లేదు.. ఈ క్రమంలో తేజ్ నువ్వు నును సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ వద్ద ఓ కథ ఉండడంతో నటుడు బెనర్జీ నిర్మాతలు పి.ఎల్. నారాయణ, ఎస్.గోపాలరెడ్డిల వద్దకి తీసుకెళ్ళి కథను వినిపించారు..ముందుగా ఆ కథను తరుణ్ తో చేయాలనీ అనుకున్నారు.. కానీ తరుణ్ బిజీగా ఉడడంతో మరో యాక్షన్ కథను వినిపించారు దశరథ్.. అది వారికి బాగా నచ్చి నాగార్జునకి కూడా వినిపించారు.. కానీ అప్పటికే నాగ్.. షాజీ కైలాశ్ దర్శకత్వంలో శ్రీరాం అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.. మళ్ళీ యాక్షన్ కథ వద్దని ఏదైనా ఫ్యామిలీ, లవ్ స్టోరీ ఉంటే చేద్దామని నాగార్జున చెప్పడంతో రచయిత గోపీమోహన్ తో కలసి ఓ ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసే పనిలో పడ్డారు దశరథ్.
హిందీ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్లో కథానాయకుడు అజయ్ దేవ్ గణ్ పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున పాత్రకు ఉంటే బావుంటుందని అనుకున్న దశరథ్ అలా ఓ స్టోరీ లైన్ అనుకోని మొత్తం కథని ఓ వారంలో ఫినిష్ చేశారు. లైన్ నాగార్జునకి బాగా నచ్చడంతో మిగతా స్క్రిప్ట్ అంతా ఫినిష్ చేశారు. కానీ క్లైమక్స్ విషయంలో మాత్రం ఏదో అసంతృప్తి ఉండడంతో ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నారు.. క్లైమక్స్ సన్నివేశంలోని సంభాషణలు త్రివిక్రమ్ రాసినవే కావడం విశేషం. సినిమా స్క్రిప్ట్ మొత్తం విన్న నాగార్జున దశరథ్ టాలెంట్ కి ఫిదా అయిపోయారు. ఏకంగా డైరెక్షన్ కూడా తననే చేయమని దశరథ్ కి ఆఫర్ కూడా ఇచ్చాడు. ముందుగా దైర్యం సరిపోని దశరథ్ .. ఓ ఎనమిది నెలల సమయం తీసుకొని డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకొని దర్శకత్వం వహించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాకి సంతోషం అనే టైటిల్ గోపీమోహన్ పెట్టారు.
హిందీ సినిమా లగాన్ సినిమాలో నటించిన గ్రేసీ సింగ్ ని ఒక హీరోయిన్ గా ఫిక్స్ కాగా మరో హీరోయిన్ కోసం చాలానే మందిని అనుకున్నారు.. ఫైనల్ గా ఇష్టం సినిమా పోస్టర్ చూసిన దశరథ్ శ్రియని తీసుకున్నారు. మరో రెండు ముఖ్యమైన పాత్రలకి ప్రభుదేవా, సీనియర్ దర్శకుడు విశ్వనాథ్ ని తీసుకున్నారు. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీత అందించగా, సినిమాలో పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్ రాశారు. సో మచ్ టు సే సాంగ్ ని దర్శకుడు చంద్రసిద్దార్థ్ రాశారు.
ఈ సినిమాకి గాను ఉత్తమ నటునిగా నాగార్జునకి నంది అవార్డు లభించింది, చిరంజీవి ('ఇంద్ర' సినిమా)తో కలసి ఈ అవార్డును పంచుకున్నారు నాగార్జున.. ఇలా ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ముందుగా తరుణ్ తో అనుకున్న కథతో గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం కావాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది కుదరలేదు.