OTT : ఓటీటీలోకి 28 డిగ్రీస్ సెల్సియస్

Update: 2025-04-29 11:30 GMT

నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన మూవీ '28 డిగ్రీస్ సె ల్సియస్'. ‘పొలిమేర' సిరీస్ చిత్రాలతో తనకంటూ మంచి ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్.. ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 4న ప్రే క్షకుల ముందుకువచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందీ చిత్రం. ఇప్పుడీ ఈమూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం నెలరోజుల్లోనే ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రి ల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఈ సినిమా కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మూవీని వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యా నర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.

Tags:    

Similar News