Kamal Haasan : 64 ఏళ్ల సినీ ప్రయాణం.. అలుపెరుగని నటుడు, అవార్డుల కింగ్
'విశ్వ నటుడు' అన్న పేరును సార్థకం చేసుకున్న 'ఇండియన్ 2' హీరో;
దర్శకుడు శంకర్ భారతీయ చలనచిత్రంలో అత్యంత శక్తివంతమైన చిత్రనిర్మాతలలో ఒకరు. ఆయన నెక్స్ట్ మూవీ కమల్ హాసన్ తో తీస్తున్న విషయం తెలిసిందే. విశ్వ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ' ఇండియన్ 2(భారతీయుడు 2)'.. అప్పట్లో ఇండయన్ సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత శంకర్ - కమల్ హాసన్‌ల కాంబినేషన్ లో సినిమా రానుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కమల్ హాసన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 64ఏళ్లు అవుతుండడంతో ఇండియన్ 2 మూవీ యూనిట్.. ఆయనకు మంచి సర్ఫ్రైజ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అత్యద్భుతంగా రూపొందించిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.
ఈ పోస్టర్ లో ఉలగనాయగన్ కమల్ హాసన్ అధిష్టానంపై కూర్చుని కనిపిస్తున్నాడు. చుట్టూ ఉన్న జనం అతన్ని కీర్తిస్తున్నట్టు నినాదాలు కొడుతుండగా.. కమల్ ముఖంలో ఆ ధైర్యం, నిజాయతీ, పట్టుదల ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ఇక కమల్ హాసన్ సినీ ప్రయాణం విషయానికొస్తే.. ఆయన భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధిక సంఖ్యలో అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయనకు 6 భాషల్లో మొత్తం 232 చిత్రాల్లో నటించారు. ఈ 64 ఏళ్ల కమల్ హాసన్ సినీ జర్నీలో.. మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి సినిమాలు ఆయనకు టాలీవుడ్ లో స్టార్ డమ్ ను తెచ్చిపెట్టాయి. హిందీలో ఏక్ దుజే కే లియే, సద్మా, సాగర్ వంటి చిత్రాల విజయం తర్వాత కమల్ హాసన్ బాలీవుడ్‌లో ప్రముఖ నటుల లిస్ట్ లో చేరిపోయాడు. కన్నడ, బెంగాలీ చిత్రాల్లోనూ కమల్ నటించారు. ఇప్పటి వరకు ఆయన పద్మభూషణ్, నాలుగు జాతీయ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి చెవాలియర్ అవార్డు, నంది స్క్రీన్ అవార్డులను గెలుచుకున్నాడు. కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో అనేక చిత్రాలను నిర్మించాడు, దర్శకత్వం వహించాడు, అవి విమర్శకుల వాణిజ్యపరమైన ప్రశంసలు పొందాయి.
విక్రమ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆయన.. ప్రస్తుతం ప్రభాస్ లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కె లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన చేతిలో ప్రజెంట్ ఇండియన్ 2తో పాటు హెచ్ వినోద్ తో కెహెచ్ 233, మణిరత్నంతో కెహెచ్ 234 సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
Ups & Downs, Laurels & Challenges. He's seen it all. But nothing can come between Ulaga Nayagan and his untiring effort to uplift the Industry. The Unparalleled Emperor for 6 decades is stepping into his 64th year in Cinema.#64YearsOfKamalism#KamalHaasan
— shruti haasan (@shrutihaasan) August 12, 2023
Designed by -… pic.twitter.com/T1EGDPzLSW