Nari Nari Naduma Murari :+ నారీ నారీ నడుమ మురారి పాట బలే ఉందే

Update: 2026-01-07 07:52 GMT

నారీ నారీ నడుమ మురారి మూవీ నుంచి ఒక పాట విడుదలైంది. రిలీజ్ అవగానే ఆకట్టుకుంటోందీ పాట. నిజానికి రిలీజ్ టైమ్ దగ్గరగా ఉండగా ఇలా పాట విడుదల చేయడం అంత కొత్తేం కాదు. కానీ మంచి పాటలు ముందుగానే విడుదల చేయాల్సి ఉంది.బట్ అందుకు భిన్నంగా వీళ్లు ఈ సారి మంచి పాట విడుదల చేశారు. శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించిన మూవీ ఇది. రాజ్ అబ్బరాజు దర్శకుడు. మూవీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా డల్ గా ఉంది. బట్ ఈ పాట మాత్రం ఆకట్టుకునేలా ఉంది.

‘అమ్మాయి అచ్చ తెలుగు సుందరి.. సౌభాగ్య లక్ష్మి పోలిక.. అబ్బాయి మాటకారి మోహనాంగుడే.. తానున్న చోట వేడుక.. చూసేటి కళ్లకెంత చూడముచ్చట.. ముద్దైన జంట వీరట.. ప్రేమన్న ఊహ కూడా ఇచ్చటా.. ’ అంటూ సాగే పాట ఇది. వినగానే ఆకట్టుకునేలా ఉంది. కంపోజింగ్ బ్యూటీఫుల్ గా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. అతని పాటలు ఇలాగే బ్యూటీఫుల్ గా ఉండటం ఇదేం కొత్త కాదు కూడా. హరిచరణ్ పాడిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రీ రాశాడు.

పాటంతా కేరళ సంప్రదాయంలో సాగేలా ఉంది. ఈ పాట సాగేది కూడా కేరళలోనే. మరి వీళ్లంతా కేరళలో పెళ్లి వేడుకకోసం వచ్చారా లేక ఇంకేదైనా పెళ్లిలో శర్వానంద్, సాక్షి వైద్య కలిసి ఉంటారా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. మొత్తంగా పాట మాత్రం చాలా బావుంది. 

Full View

Tags:    

Similar News