Kiran Abbavaram 'Ka' : ‘క’నుంచి మరో బ్యూటీఫుల్ సాంగ్

Update: 2024-10-29 12:30 GMT

‘క’.. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా. ఈ నెల 31న విడుదల కాబోతోన్న ఈమూవీపై ముందు నుంచి అన్నీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనే టాక్ బలంగా ఉంది. పండగ టైమ్ లో పోటీ ఉన్నా.. దీటుగా నిలిచే సినిమా ఇదే అనే టాక్ కూడా ఉంది. ట్రైలర్ తర్వాత అంచనాలు పెరిగాయి. ఇక శామ్ సి సంగీతంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పాటలన్నీ బావున్నాయి. లేటెస్ట్ గా మరో బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. సానపాటి భరద్వాజ పాత్రుడు రాసి ఈ గీతాన్ని శరత్ సంతోష్ పాడాడు. మంచి సాహిత్యం.. మంచి గాత్రం తోడై వినగానే ఫిదా అయిపోయేలా ఉందీ సాంగ్.

‘కనులకు కానుకలా కనబడినావే.. కొడవలి చూపులతో కలబడినావే.. తలవగ నీవే కలవరమాయో.. కల కలమాయొ.. నీ కళ్లు కళ్లు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు.. అంటూ బుజ్జమ్మాయి’ అనే హుక్ లైన్ తో బలే స్టార్ట్ అయింది సంగీతం, సాహిత్యం. ఈ సినిమా 1980ల నేపథ్యంలో సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే శామ్ సి ఇన్ స్ట్రుమెంటేషన్ ఉంది.

‘వంపు సొంపులింపుగున్న వయ్యారీ.. చెంపలోన కెంపులున్న చింగారి.. దిష్టి చుక్క పెట్టుకోవే సింగారి..’అంటూ స్టార్ట్ అయిన రెండో చరణం మరింత ఆకట్టుకుంది. ఇదే చరణంలో ‘కాపలాగా కాచుకున్న కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మా.. చూపు రువ్వి చిచ్చు రేపు సందమామవమ్మా..’ అంటూ అప్పటి వరకూ సత్యభామ అన్న భామను సందమామను చేసిన సాహిత్యం ఇంకా బావుంది.

మొత్తంగా ఈ పాటకు థియేటర్ లో ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. సుజిత్ - సందీప్ ద్వయం ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ పాట కూడా ప్రేక్షకులను మెప్పించేసింది. 

Full View

Tags:    

Similar News