Akira Nandan : అకిరా పై అన్నీ అబద్ధాలే

Update: 2024-10-21 05:45 GMT

ఇండస్ట్రీలో స్టార్స్ పైనే కాదు.. వారి వారసులపై కూడా అప్పుడప్పుడూ రూమర్స్ వస్తుంటాయి. ఇక టాప్ హీరో వారసుల గురించైతే చెప్పనే అక్కర్లేదు. కొన్నాళ్ల క్రితం బాలకృష్ణ తనయుడు మోక్షజ్న పై కూడా ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయి. అతను సినిమా అనౌన్స్ చేయడం అందుకోసం కొత్త మేకోవర్ తో కనిపించడంతో అందరి నోళ్లూ మూతపడ్డాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పైనా రోజుకో వార్త కనిపిస్తోంది. అయితే తాజాగా వచ్చిన న్యూస్ ను చాలామంది నమ్మేశారు. ఇంకా చెబితే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఏకంగా సంబరాలు చేసుకున్నారు. బట్ ఇదంతా నిజం కాదు. జస్ట్ మరో రూమర్ అంతే అని కన్ఫార్మ్ అయింది. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఓ.జి మూవీలో అకిరా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడని.. ఈ మూవీతనే అతని టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతోందని.

బట్ ఇదంతా నిజం కాదని తేల్చేశారు. ఈ మూవీలో అకిరా నందన్ కనీసం కనిపించడం కూడా లేదని తేల్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సినీ వారసుడుగా అకిరాను ఇప్పటికే చూస్తున్నారు జనం. ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. అదనంగా సంగీతం నేర్చుకుంటున్నాడు. ఇవి కాక రెగ్యులర్ గా సినిమాలను చూస్తూ.. తండ్రితో కలిసి అప్పుడప్పుడూ జనం ముందుకు వస్తున్నాడు. ఇవన్నీ తెరంగేట్రానికి సన్నద్ధం కావడానికే అని వేరే చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడు ఓ.జిలో మాత్రం అతను నటించడం లేదు. అదీ మేటర్.

Tags:    

Similar News