Pawan Kalyan : ఓ.జి రిలీజ్ డేట్.. ఏం బ్లాస్టింగ్ అప్డేట్ రా నాయనా

Update: 2025-05-25 12:59 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకూ చేసింది ఒక లెక్క.. ఇదో లెక్కా అని వారంతా భావిస్తోన్న సినిమా ఇది. అందుకే ఈ అప్డేట్ కోసం యేడాదిగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికే ఈ బ్లాస్టింగ్ న్యూస్. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. యేడాది క్రితమే వచ్చిన టీజర్ కే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయింది. దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ సాగిన ఆ టీజర్ లో పవన్ అరాచకం అంతా ఇంతా కాదు. గతంలోనూ పంజా వంటి మూవీస్ లో గ్యాంగ్ స్టర్ గా నటించాడు పవన్. బట్ ఈ సారి వేరే లెవల్ అనేలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే దానికి చాలా ముందుగా రాబోతోన్న హరిహర వీరమల్లు కంటే కూడా ఈ మూవీ అప్డేట్స్ కోసమే చూస్తున్నారు.

సో.. ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు స్వయంగా నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. విశేషం ఏంటంటే.. గతేడాది కూడా ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. అంటే యేడాది ఆలస్యంగా విడుదలవుతోందన్నమాట. ఈ డేట్ కు రావడం పక్కా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పెండింగ్ మూవీస్ ను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలనుకుంటున్నాడు పవన్. అందుకే హరిహరను పూర్తి చేశాడు. నెక్ట్స్ ఓ.జి వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఓ నెల రోజుల పాటు సాగే చిత్రీకరణతో ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటి వరకూ అయిన షూటింగ్ పార్ట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఆ రిలీజ్ డేట్ కు రావడం పెద్ద కష్టమేం కాదు. పైగా దర్శకుడు సుజిత్ ను సూపర్ ఫాస్ట్ అంటుంటారు కదా. సో.. సెప్టెంబర్ 25న విడుదల కావడం ఖాయంగా భావించొచ్చు.

ఇక పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ పాత్రల్లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.

 

Tags:    

Similar News