NTR 30: కొరటాల ప్లాన్ అదిరిందిగా..! ఎన్‌టీఆర్‌తో ఐటెమ్ గర్ల్‌గా..
NTR 30: కొరటాల శివ, ఎన్‌టీఆర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం ఓ యంగ్ హీరోయిన్‌ను లాక్ చేసిందట మూవీ టీమ్.;
NTR 30: ఇప్పుడే కాదు ఎప్పటినుండి అయినా.. తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు చాలానే క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ ఒక్క పాట కోసం బాలీవుడ్ నుండి భామలను దింపుతుంటారు. ఈమధ్య తెలుగులోని సీనియర్ హీరోయిన్లతో ఈ పాటలు చేయించడం ట్రెండ్ అయిపోయింది. కాగా కొరటాల శివ, ఎన్‌టీఆర్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం ఓ యంగ్ హీరోయిన్‌ను లాక్ చేసిందట మూవీ టీమ్.
ఎన్‌టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా తాను నటించిన 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. ఇప్పటికే జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ప్రతీ భాషా ప్రేక్షకుడికి దగ్గరయ్యాడు ఎన్‌టీఆర్. అందుకే కొరటాల శివ తన అప్‌కమింగ్ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడం కోసం ఇప్పటికే ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను ఎంపిక చేశారు.
ఇక ఎన్‌టీఆర్ 30వ చిత్రంలో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పటానీని రంగంలోకి దించనుందట మూవీ టీమ్. తెలుగులో 'లోఫర్' లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన దిశా.. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమయ్యింది. ప్రస్తుతం ఈ భామ ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఎన్‌టీఆర్‌తో స్పెషల్ స్టెప్పులేసే ఛాన్స్ కొట్టేసింది దిశా.