నిప్పులేకుండా పొగరాదు అంటారు. అందుకే కొన్ని రూమర్స్ ను ఈజీగా కొట్టిపడేయలేం. అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీ లీల జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా ‘మాస్ జాతర’అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భాను భోగవరపు ఈచిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. రవితేజ కోరి మరీ ఈ దర్శకుడిని ఎంచుకున్నాడు అంటారు. ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ రూమర్ హల్చల్ చేసింది.
మాస్ జాతరలో రవితేజ నటించిన ఇడియట్ మూవీలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే హిట్ సాంగ్ ను రీమిక్స్ చేశారు అని. అది చాలా వరకూ రూమర్ అనుకున్నారు. బట్ నిజమే అని డిక్లేర్ చేశాడు నాగవంశీ. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈ సాంగ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోతో ఇడియట్ సాంగ్ రీమిక్స్ గురించిన వార్తను నిజమే అని చెప్పకనే చెప్పారు. పాట లేదు కానీ.. ఆ పాటలోని ఐకనిక్ ట్యూన్ ను మాత్రం ఈ ప్రోమోలో ఉంచారు. అలాగే అప్డేట్ తో పాటు ‘ఏ లిటిల్ నోస్టాల్జియా, ఏ లాట్ ఆఫ్ మాస్ హిస్టీరియా’ అనే లైన్ యాడ్ చేశాడు నాగవంశీ. అంటే కేవలం ఈ ట్యూన్ మాత్రమే పాటలో ఉంటుందేమో. మిగతా లిరిక్స్ అన్నీ కొత్తగా ఉంటాయని తేల్చేశాడు అనుకోవచ్చు.
ఇక ఈ మూవీని మే 9న విడుదల చేస్తారు అని చెప్పారు. బట్ తాజాగా జూలై 27కు పోస్ట్ పోన్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయంపై నాగవంశీ ఇప్పటి వరకూ రియాక్ట్ కాలేదు. మొత్తంగా ఇడియట్ సాంగ్ అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. మరి ఇప్పటి యూత్ ను కూడా ఈ రీమిక్స్ ఊపేస్తుందా అనేది చూడాలి.