JagadekaVeeruduAthilokaSundari : 35 యేళ్లు వెనక్కి వెళ్లిన మెగా టీమ్

Update: 2025-05-07 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రాన్ని ఈ నెలలో మళ్లీ అదే డేట్ కు రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ అంటే ఏదో ఆషామాషీగా కాదు. ఇక ఈ మూవీ ఎవర్ గ్రీన్ అనేలా 8కే అప్డేట్ చేయించారు. ఆనాటి రీల్స్ ను ఈనాటి టెక్నాలజీకే కాదు.. రాబోయే మూడు నాలుగు దశాబ్దాల వరకూ ఏ ఇబ్బందీ లేకుండా అప్డేట్ చేయించారన్నమాట. అలాగే ఈ ఎపిక్ ను ఈ సారి త్రీడీలోనూ చూసేలా మార్చారు. మానస సరోవరాన్ని త్రీడీలో చూస్తే ఆ అనుభూతిని ఎలా వర్ణించగలం. ఓ రకంగా జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక ఏజ్ లెస్ మూవీ. అన్ని ఏజ్ ల వాళ్లు ఎన్ని కాలాల్లో చూసినా అదే అనుభూతి కలిగించే అరుదైన చిత్రం. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూస్తున్నంత సేపూ ఓ కొత్త ప్రపంచంలో విహరింపచేసిన చిత్రం.

అలాంటి మూవీ మళ్లీ విడుదలవుతుందంటే.. అందులో నటించిన, రూపొందించిన వారి మదిలో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతాయి..? ఆ నాటి ఎన్ని మధుర స్మృతులు తలంపుకు వస్తాయి..? అందుకే అవన్నీ కలబోసుకుని మనతో పంచుకోవడానికి రాబోతున్నారు.. 35 యేళ్ల నాటి ఆ ఊసులన్నీ పంచుకోబోతున్నారు.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్. ఈ ముగ్గురూ కలిసి ఈ మూవీ గురించి ముచ్చట్లను పంచుకుంటూ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో చూస్తే మళ్లీ మానస సరోవరం సెట్ వేసి అందులో నిర్వహించినట్టు కనిపిస్తోంది. సుమ యాంకరింగ్ చేసిన ఈ ఇంటర్వ్యూ గురువారం విడుదల చేయబోతున్నారు. సో.. సినిమా చూడ్డానికి ఒక్క రోజు ముందుగా ఆ చిత్ర విశేషాలను మనమూ చూడొచ్చన్నమాట.

Tags:    

Similar News