మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో కూడా మంచి దూకుడు చూపిస్తున్నాడు. ఆయన ఉత్సాహానికి తగ్గట్టుగా కొత్తతరం దర్శకులు మంచి కథలతో రావడం లేదు. అందుకే 2023లో వచ్చిన భోళా శంకర్ తర్వాత ఆయన్నుంచి మరో మూవీ రాలేదు. మధ్యలో విశ్వంభర చేశాడు. కానీ ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయని మళ్లీ చేస్తున్నారు. మరి అవెప్పుడు పూర్తయివుతాయో ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పటి వరకూ ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి క్లారిటీ ఎవరికీ రావడం లేదు. ఈ విషయంలో మెగాస్టార్ కూడా చిరాకు పడ్డాడేమో.. విశ్వంభరను వదిలేసి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు.
సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. మరి సీనియర్ హీరోలు అంటే హీరోయిన్లతో పెద్ద సమస్య వస్తూనే ఉంది కదా. చిరంజీవికీ తప్పడం లేదు. ఇప్పటికే ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించబోతోందనే వార్తలు వచ్చాయి. బట్ టీమ్ కన్ఫార్మ్ చేయలేదు. అయితే తాజాగా కేథరీన్ థ్రెసాను తీసుకున్నారు. మరి తను మెగాస్టార్ కు జోడీగా నటిస్తుందా లేక వాల్తేర్ వీరయ్యలాగా ఇంకేదైనా పాత్రలో కనిస్తుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఇక్కడి హీరోయిన్లు అయిపోయారు అన్నట్టుగా చిరంజీవికి జోడీగా నటించబోతున్నారు అంటూ కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వస్తోన్న బ్యూటీ దీపికా పదుకోణ్. తను ఇంతకు ముందు తెలుగులో ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో మెరిసింది. కల్కికి సీక్వెల్ కూడా ఉంది కాబట్టి మరోసారి ఇక్కడ షైన్ అవుతుంది. అయితే ఈ లోగా చిరంజీవితో దీపికా పదుకోణ్ రొమాన్స్ చేయబోతోందని వస్తోన్న వార్తలన్నీ రూమర్స్ అనే అనుకోవచ్చు. మొత్తంగా ఈ హీరోయిన్ గొడవేదో త్వరగా తేలిస్తే ఆ రూమర్స్ అన్నీ ఆగిపోతాయి కదా అనిల్..?