యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర బ్లాక్ బస్టర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు చాలామంది. బట్ అతను ఆల్రెడీ నెక్ట్స్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. అఫ్ కోర్స్ దేవర విజయాన్ని కూడా ఆస్వాదించాడు. మధ్యలో పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సినిమాపై ఎంతోమంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసినా తను మాత్రమే నమ్మాడు. ఆ నమ్మకాన్ని బాక్సాఫీస్ నిజం చేసింది. ఇక సినిమా విడుదలై కూడా 20 రోజులవుతోంది. కొన్ని చోట్ల ఫుల్ రన్స్ పడుతూనే ఉన్నాయి. అందుకే తర్వాతి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ‘వార్ 2’ షూటింగ్ లో ఈ శనివారం నుంచి జాయిన్ అయిపోయాడు. ఇందుకోసం స్పెషల్ మేకోవర్ అంటూ లేదు కానీ.. ఆ పాత్రకు తగ్గ కేర్ మాత్రం తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పాటు హ్రుతిక్ రోషన్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ, జాన్ అబ్రహాం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
అయితే ఈ మూవీకి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. వార్ 2 ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి.. తెలుగు వరకు తెలుగు టైటిల్ నే పెడతారంటున్నారు. అంటే ‘వార్ 2 - యుద్ధభూమి’అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటున్నారు. కొన్నాళ్లుగా డబ్బింగ్ సినిమాలకు తెలుగు టైటిల్స్ ఉండటం లేదు అని ప్రేక్షకుల్లో ఓ అసహనం కనిపిస్తోంది. అది వేట్టైయన్ మూవీ కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. అందుకే వార్ 2 కు ఆ టైటిల్ తో పాటు యుద్ధభూమి అని తెలుగు టైటిల్ కూడా పెడతారట. విశేషం ఏంటంటే.. ఈ టైటిల్ ను చూపుతూ 2023లోనే హ్రుతిక్ రోషన్ .. ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ.. యుద్ధభూమికి స్వాగతం అన్నాడు. సో అదే ఫిక్స్ అయిపోయిందన్నమాట.