గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 2026 మార్చి 27న విడుదల కాబోతోన్న ఈ చిత్రం కోసం పూర్తి డెడికేషన్ తో పనిచేస్తున్నాడు. సెకండ్ మూవీ డైరెక్టర్ అయిన బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు చరణ్. ఆల్రెడీ అతన్ని రంగస్థలం టైమ్ లో సుకుమార్ కో డైరెక్టర్ గా చూసి ఉన్నాడు కాబట్టి చరణ్ కు బుచ్చి కెపాసిటీ ఏంటో బాగా తెలుసు. పైగా రంగస్థలంలో చాలా కీ సీన్స్ లో బుచ్చిబాబే ప్రధానం అని సుకుమారే చెబుతుంటాడు కదా. పైగా ఈ చిత్రానికి సుకుమార్ సాయం కూడా ఉంది. అందుకే మరో థాట్ లేకుండా ఒప్పుకున్నాడు. చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదొక్కటే కాస్త తేడాగా ఉంది. ఎందుకంటే రెహమాన్ సంగీతం చేసిన తెలుగు సినిమాలన్నీ పోయాయి. రామ్ చరణ్ పెద్దిగా బిజీగా ఉన్న ఈ టైమ్ లో ఓ స్ట్రాంగ్ రూమర్ వినిపిస్తోంది. అది కూడా త్రివిక్రమ్ తో కలిపి కావడంతో అంతా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ .. అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అతను సడెన్ గా అట్లీ ప్రాజెక్ట్ వైపు వెళ్లడంతో త్రివిక్రమ్ ఖాళీ అయిపోయాడు. అయితే అతని వద్ద రామ్ చరణ్ కు సెట్ అయ్యే కథ ఉందని.. ఆ కథతో ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు విపిరీతంగా వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ను తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్ డైరెక్ట్ గా ఈ మేటర్ ను ఏకంగా నాగవంశీయే లీక్ చేశాడు అనేది ఈ రూమర్ కు అదనంగా వినిపిస్తోన్న మాట.
రామ్ చరణ్ ఈ పెద్ది మూవీ తర్వాత సుకుమార్ తో ప్రాజెక్ట్ కు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఆ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయింది కూడా. అలాంటిది మధ్యలో త్రివిక్రమ్ పేరు రావడం, హీరోయిన్ నేమ్ కూడా యాడ్ అవుతుండటం కొంత అనుమానంగా ఉన్నప్పటికీ.. ఈ కాంబోలో సినిమా ఇప్పుడప్పుడే వస్తుందనుకోలేం. అదే టైమ్ లో సాధ్యం కాదు అని కూడా చెప్పలేం. వ
విశేషం ఏంటంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్ .. వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరగబోతోందని కూడా అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందు వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ కు డైలాగ్స్ రాశాడు. దర్శకుడు అయిన తర్వాత మల్లీశ్వరికి రాశాడు. సో.. ఆయన రైటింగ్ కు ఈయన టైమింగ్ కు అద్భుతంగా సెట్ అవుతుందని ఆ రెండు సినిమాలూ ప్రూవ్ చేశాయి. ఇక డైరెక్షన్ కూడా తోడైతే మంచి మూవీ వస్తుందనుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు సడెన్ గా రామ్ చరణ్ పేరు వినిపిస్తుండటం ఇప్పటికైతే రూమర్ అనే చెప్పాలి.