ఈ వారం సినిమాలేం విడుదల కావా అంటే అవును అన్నట్టుగానే చెప్పాలి. మామూలుగా అయితే చిన్నవో, తెలియని సినిమాలో అయితే కొన్నిసార్లు ఒక్కో వారం ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి. ఇంకొన్ని సార్లైతే ఏకంగా పది పన్నెండు సినిమాలు కూడా ఒకే వారంలో విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఈ వారం పరిస్థితి ఏంటీ అంటే చాలా దారుణంగా ఉంది. వచ్చే వారం ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలకు భారీ హైప్ ఉంది. ఆ కారణంగా ముందు వారం వచ్చే మూవీస్ కాస్త వెనక్కి తగ్గాయా అంటే అవును అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిజానికి ఈ నెల 13న బ్యాండ్ మేళం మూవీ ఉంది. కానీ వాళ్లు ఈ కారణంగానే రెండు వారాలు వెనక్కి తగ్గి మార్చి 26న రిలీజ్ చేసుకుంటున్నారు. ఇక మరి ఈ వారం అంటే రెండు మూడో కనీసం సరైన పేరు కూడా లేని సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రెండు మూవీస్ డబ్బింగ్ కూడా.
డార్క్ నైట్ అనే డబ్బింగ్ మూవీ సడెన్ గా రిలీజ్ డేట్ పోస్టర్స్ వేసింది. పూర్ణ, విదార్థ్, త్రిగుణ్, శుభశ్రీ కీలక పాత్రల్లో నటించిన ఈ తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ విషయం జనాలకు తెలిసేంత సీన్ కూడా లేదు. ఇది కాక ‘జేఎస్కే జానకి’ మూవీ కూడా విడుదలవుతోంది. ఇది ఎప్పుడో మళయాలంలో రిలీజ్ అయిన మూవీ. ఇన్నాళ్లకు తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. స్టేట్ ఆఫ్ కేరళ అనే లైన్ తో విడుదల కాబోతోన్న మూవీలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ కీలక పాత్రల్లో నటించారు. మొత్తంగా ఈ రెండు డబ్బింగ్ మూవీస్ తో పాటు ఒకట్రెండు డైరెక్ట్ తెలుగు మూవీస్ కూడా విడుదలవుతున్నాయి. బట్ వీటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మొత్తంగా ఈ వారం గ్యారెంటీగా చూడాల్సిన సినిమాలంటూ ఏం లేవు అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయి ఉన్నట్టుగా కనిపిస్తోంది.